తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, తిరుపతి వారి అద్వర్యంలో, కలెక్టరేట్ నందు గల సమావేశ మందిరం, తిరుపతి నందు భేటీ బచావో అండ్ భేటీ పడవో (బాలికను రక్షించండి – బాలికను చదివించండి) పై జిల్లా స్థాయి అధికారులతో డిస్ట్రిక్ట్ రెవిన్యూ అధికారి పెంచల కిశోర్ గారి ఆధ్వర్యములో శక్తీ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమములో డిస్ట్రిక్ట్ రెవిన్యూ ఆఫీసర్ మాట్లాడుతూ శిశు లింగ నిష్పత్తిని పెంచడం, లింగ వివక్షతను లేకుండ చేయడం, ఆడ పిల్లలను రక్షించి, చదివించాలనే లక్ష్యంతో భేటీ బచావో భేటీ పడవో పధకం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. భృణ హత్యలను మరియు బాల్య వివాహాలను అరికట్టుటకు అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పని చేయవలెనని తెలిపారు. ఆడ పిల్లలు పుట్టడం అనేది అదృష్టంగా భావించాలని, మగ పిల్లలతో సమానంగా ఆడ పిల్లలను పెంచాలని అన్నారు. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్స్ పైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్ఠి పెట్టాలని, ఎవరైన ఏ బిడ్డ పుడుతాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూదని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని జయలక్ష్మి మాట్లడుతూ “భేటీ బచావో – భేటీ పడావో” కార్యక్రమము ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలు వివరించటం జరిగినది
మహిళా పోలీస్ స్టేషన్ ఎం. శ్రీలత డీస్పీ మాట్లడుతూ పిల్లలకి మరియు మహిళలకు సంబంధించి అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్స్తున్నాము అని, ఆడ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కాళ్ళ పై వాళ్ళు నిలబడి ఏ రంగంలో అయిన మగవారితో సమానంగా ఎదగాలని తెలిపారు. మగ పిల్లలకు స్కూల్లలో మరియు కాలేజీలలో గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ గురించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టవలసిన ఆవశ్యకత గురించి తెలిపారు. ఈ కార్య క్రమములో వివిధ విభాగాధి పతులు మరియు మిషన్ వాత్సల్య సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …