4.52 లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాల పంపిణీ 87.82 శాతం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 5,14,984 మంది బాలికలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగాuni గురువారం సాయంత్రం వరకు 4,52,275 మందికి టీకాలు వేశారు. మరో 62,709 మందికి టీకాలు వేయాల్సి ఉంది. జిల్లాల వారీగా చూస్తే వైఎస్సార్‌ జిల్లాలో 105.81 శాతం, నంద్యాలలో 100.40 శాతం టీకాలు వేసి లక్ష్యాన్ని అధిగమించాయి. మార్కాపురంలో 99.16 శాతం, పల్నాడులో 98.74 శాతం, కర్నూలులో 94.28 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 93.61 శాతం, తిరుపతిలో 93.22 శాతం నమోదయ్యాయి. మరో 15 జిల్లాల్లో 80 శాతానికి పైగా టీకాలు వేశారు.
అత్యల్పంగా పోలవరం జిల్లాలో 63.32 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 65.43 శాతం నమోదయ్యాయి.