– ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, పోలింగ్ అధికారులు, సిబ్బందికి కల్పించిన సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ముందస్తు చర్యలను పరిశీలించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఇబ్రహీంపట్నం మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 116 వార్డులకు, మైలవరం మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో 154 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
