భక్తిశ్రద్ధలతో బొండా రవితేజ స్వామి వారి ఇరుముడి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గవర్నర్‌పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శనివారం (నవంబర్ 21) యువ నాయకుడు బొండా రవితేజ స్వామి వారి ఇరుముడి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కేరళ మేల్‌శాంతి శ్రీ దామోదర్ ఆధ్వర్యంలో గురుస్వాముల సమక్షంలో ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా ఇరుముడి కార్యక్రమం జరిగింది. అనంతరం రవితేజ స్వామి శబరిమల యాత్రకు బయలుదేరారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, బొండా సుజాత, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ హాజరై రవితేజ స్వామికి ఆశీస్సులు అందజేశారు. అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. రవితేజ స్వామి శబరిమల యాత్ర విజయవంతం కావాలని, స్వామివారి దివ్య దర్శనం లభించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అయ్యప్ప భక్తులు ఆకాంక్షించారు.