విజయకీలాద్రిపై వైభవంగా కార్తీక పూర్ణిమ కృత్తికా దీపోత్సవం

-పల్లకిసేవ, దీపస్తంభ ప్రజ్వలనతో ఆధ్యాత్మిక శోభ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై కార్తీక పూర్ణిమ మహోత్సవం (కృత్తికా దీపోత్సవం) అత్యంత వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
మహోత్సవంలో భాగంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. అనంతరం దీపస్తంభాన్ని ప్రజ్వలించి కృత్తికా దీపోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
దీపకాంతులతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివారి పల్లకిసేవను దర్శించుకున్న భక్తులు, దీపోత్సవంలో పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ పవిత్ర మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి మంగళాశాసనాలు, అనుగ్రహ ఆశీస్సులు పొందారు.