విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నీతి ఆయోగ్ సభ్యురాలు డా.జోరమ్ ఆనియా(Joram Aniya)(కేంద్ర సహాయ మంత్రి హోదా) తో కూడిన బృందం శనివారం విజయవాడలో సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్య,పర్యాటక, యువజన సంక్షేమ రంగాల్లో చేపట్టిన వివిధ పథకాలు, ప్రాజెక్టులు,కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు.అదే విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల అమలు తీరును డా.జోరమ్ ఆనియా సిఎస్ సాయి ప్రసాద్ ను ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో అమలవుతున్న పలు పధకాలు,కార్యక్రమాల ప్రగతిని నీతి ఆయోగ్ సభ్యురాలుకు వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా,శాప్ ఎండి భరణి, యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నీలకంఠా రెడ్డి,నీతి ఆరోగ్య స్టేట్ నోడలు అధికారి డా.సేతుపతి తదితరులు పాల్గొన్నారు.
