పెనుమంట్ర , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత గా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. పెనుమంట్ర మండలం జడ్పిటిసి గా ఎన్నికైనకర్రీ సుభాషిణి మంత్రిని గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు కర్రి సుభాషిణి ని అభినందించారు. ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు …
Read More »Konduri Srinivasa Rao
పనే దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పనే దైవం అనుకుంటే చాలు ఆలోచనలు, అవకాశాలు వెతుక్కొంటూ అవే వస్తాయిని, చేసే ఏ పనైనా దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని …
Read More »మండలంలో వారానికి కనీసం 500 ఇళ్లకు నిర్మాణ సామాగ్రి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి… : అధికారులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ మండలంలో వారానికి కనీసం 500 ఇళ్లకు నిర్మాణ సామాగ్రి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారానికి 500 ఇళ్లకు బేస్మెంట్ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ మండల అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ళు పథకంపై కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు , జగ్గయ్యపేట, వత్సవాయి పెనుగంచిప్రోలు, నందిగామ మండలాలకు చెందిన అధికారులతో మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ …
Read More »అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలని అధికారులకు సూచన…
-గాంధీ కొండ ను పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్ టౌన్ గాంధీజీ పర్వతం పై నగరపాలక సంస్థ చేపట్టవలసిన అభివృద్ధి పనులు అన్నియు సత్వరమే చేపట్టాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలసి గాంధీ హిల్ ను పరిశీలిస్తూ, కాంపౌండ్ వాల్ నిర్మాణ మరియు పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు తదితర అంశాలతో పాటుగా కొండ పై భాగంలో జాయ్ ట్రైన్ కు తగిన మరమతులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా …
Read More »ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు సాధిస్తాం కలెక్టర్ జె.నివాస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే చక్కటి ఫలితాలు కూడా వస్తాయని నిరూపించారని కలెక్టర్ జె.నివాస్ ఇటీవల జరిగిన కౌంటింగ్ లో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలిపారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కొంటింగ్ లో ప్రణాళికాబద్ధంగా పనిచేసినందువల్లే అతితక్కువ సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు రాకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయగలిగారన్నారు. అదే రీతిలో …
Read More »సాముహిక ఎలుకల నిర్మూలన ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చు… : జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులందరూ సాముహికంగా ఒకేసారి ఎలుకల మందును ఉపయోగించి పంటను ఎలుకల నుండి కాపాడుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సాముహిక ఎలుకల నివారణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు మరియు పాంపులేట్లను జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత (రెవిన్యూ), విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చండీతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి ఎక్కువుగా సాగవుతుందని, వరి పైరులో …
Read More »జిల్లాలో రైల్వేలకు సంబంధించి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అనుకూలమైన చర్యలు వేగవంతం చేయాలి… : కలెక్టర్ జె. నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె. నివాస్ రైల్వే, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్, నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి, రైల్వేస్ ఇంజినీర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైల్వేలకు సంబంధించి ఆయా ప్రాజెక్టు పనులు ముందుకు సాగేందుకు అనుకూలమైన …
Read More »పారిశుధ్య నిర్వహణకై 500 వీల్ బర్రోస్ కొనుగోలు, మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ల కేటాయింపు… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి వారి కళా క్షేత్రం వద్ద ప్రజారోగ్య శాఖా ఏర్పాటు చేసిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా నివాసాల నుండి చెత్త సేకరణకై సుమారు 50 లక్షల విలువలతో నూతనంగా కొనుగోలు చేసిన 500 వీల్ బేరర్స్ లను ప్రారంభించి మైక్రో పాకెట్ ఆధారంగా డివిజన్ లలోని పారిశుధ్య సిబ్బందికి అందించారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణ విధానమును …
Read More »బెజవాడ ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర ప్రజలకు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి -గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం పట్ల చంద్రబాబు విద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా వాంబే కాలనీలోని ఏ బ్లాక్ లో డివిజన్ కోఆర్డినేటర్ బెవర నారాయణతో కలిసి ఆయన పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు భరోసాని కల్పిస్తూ.. ఆరో రోజు పర్యటన సాగింది. అర్హత …
Read More »సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి చేసిన మేయర్, కమిషనర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం నందు ఏర్పాటు చేసిన సచివాలయ హెల్త్ సెక్రెటరీ లకు మెడికల్ కిట్స్ పంపిణి కార్యక్రమములో నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్, మేయర్ రాయన భాగ్య లక్ష్మి పాల్గొన్నారు. వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శ్రీ ద్వారా సిబ్బందికి మెడికల్ ఎక్యూప్ మెంట్స్ అందజేసారు. నగర పరిధిలోని 286 సచివాలయంలో గల హెల్త్ సెక్రెటరీ లకు వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్ వారు అందించిన …
Read More »