All News

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మా నాయకుడు ఎప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారు

అమరావతి నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకోసం 74 ఏళ్ల వయస్సులో జేసీబీ ఎక్కి ప్రజలకోసం చంద్రబాబు నాయుడు తపిస్తూ పనిచేస్తుంటే.. ప్రజల కన్నీళ్లు తడుస్తూ బురద నీటిలో కష్టపడుతుంటే.. ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకోకుండా… జగన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నాడు? దోచుకున్నది దాచుకోవడానికా? లండన్ లో ఆస్తులు పెంచుకోవడానికా? నీరో చక్రవర్తికి వారసుడిలా ముసలికన్నీరు కార్చి.. ఐదు నిమిషాలు షో చేసి వెంటనే లండన్ ఎందుకు వెళ్తున్నట్లు..? ఇదివరకే లండన్ లో జగన్ కు ఆస్తులు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.. …

Read More »

విజయవాడ లో ముంపు బారిన పడిన లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెబుతూ స్వయంగా భోజనం, త్రాగునీటిని అందిస్తున్న.. మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని కొన్ని లోతట్టు  ప్రాంతాలు నీట మునగటం వలన ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఇది చాలా బాధాకరమైన విషయమని, ముంపు బాధితులను ప్రభుత్వాన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ నగరంలోని వరద ముంపుకు గురైన విద్యాధరపురం, కబేల సెంటర్ లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు ఆహార …

Read More »

దుకాణములు, వ్యాపార సంస్థలన్నీ కార్మిక శాఖ లైసెన్సులు పొందాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రావాణా వాహన యాజమాన్యాలు, భవన మరియు ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, PRINCIPAL ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద వెంటనే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ ఇన్చార్జి ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, రాజమహేంద్రవరం …

Read More »

మూడో రోజు జిల్లా నుండి విజయవాడ కు పంపిన ఆహార పదార్ధాలు  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉదారత చాటుతూ, స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి ,  పారిశ్రామిక వేత్తలకు , విద్యా సంస్థలకు, స్వచ్ఛంధ సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పారిశ్రామిక దాతలు సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామివేత్తలు కంపెనీ ప్రతినిధులకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షపాతం, గోదావరి నది చేరుతున్న వరదా నీరు నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు పై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు, కె ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ …

Read More »

“సైమా బ్యూటీ ఎక్స్ పో “లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది… : భవాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో “సైమా బ్యూటీ ఎక్స్ పో” రెండు రోజులుగా జరుగుతుందని మేకప్ ఆర్టిస్ట్ గ్లోవిష్ బ్యూటీ సెలూన్ అండ్ అకాడమీ ఫౌండర్, డైరెక్టర్, వెలివల భవాని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అని ఆమె అన్నారు. రెండు రోజులుగా ఎక్స్ పో కార్యక్రమం జరిగిందని, హైదరాబాదు నుండి నేను వచ్చానని ఈ ఎక్స్ పోలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. విజయవాడ నగరంలో లబ్బీపేట లోఎస్ ఎస్ కన్వెన్షన్ లో …

Read More »

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేలా ప్రతిపాదనలు పంపుతాం

-రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను బుధవారం రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు సందర్శించి బాధిత రైతులకు ధైర్యం చెప్పి పంట నష్టం అంచనాలు వేయటం జరుగుతోందని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ఇబ్రహింపట్నం మండలం కోటికలపూడి, కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో పలు ఉద్యాన పంటలను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామాలలో దెబ్బతిన్న కాలిఫ్లవర్, మిరప, ఆకుకూరలు, కరివేపాకు ,ఇతర కూరగాయ తోటలను,మూలపాడు గ్రామంలోని …

Read More »

ముగిసిన సైమా బ్యూటీ ఎక్స్ పో

-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఓజస్ రజిని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్ పో ముగింపు సంబరాలు బుధవారం ముగిసాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ సినీ ఆర్టిస్ట్, అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ వోజాస్ రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్ పో కార్యక్రమానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎస్ బి ఎం …

Read More »

వరద పీడిత ప్రాంతాలలో ఆహరం, నీరు పంపిణీ చేసిన ఆర్ పి సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాలలో చేపడుతున్న సహాయ చర్యల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగారు రెవిన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా. వర్ష తీవ్రత ప్రారంభమైన శనివారం మొదలు, విపత్తుల నిర్వహణ సంస్ధ నుండి పరిస్ధితిని సమీక్షించటం, లేకుంటే నేరుగా వరద పీడిత ప్రాంతాలలో రంగంలోకి దిగటమో చేస్తూ వచ్చారు. సహాయ చర్యల కోసం కేటాయించిన సిబ్బందితో పాటు, తన వ్యక్తిగత సిబ్బంది అండగా, …

Read More »

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం అందచేశారు. ఢిల్లీ లో రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లకు ఈ మేరకు బుధవారం చెక్కులు అందచేసారు.కష్ట కాలంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలవ వలసిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. కష్టాల్లో …

Read More »