Breaking News

Andhra Pradesh

తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్…

-ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గియ నందమూరి తారకరామారావు అని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. సోమవారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చలనచిత్ర రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రతో …

Read More »

ప్రజల ఆర్జీలపై కలెక్టర్‌ డిల్లీరావు హృదయ ‘‘స్పందన’’

-స్పందనలో 92 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఆర్జీదారుల నుండి ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు హృదయం స్పందించింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అధికారులు తమ సమస్యలపై స్పందించి పరిష్కారం చూపుతారనే ఆశతో ప్రజలు సమర్పించే ఆర్జీలను గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించడం ద్వారా ఆర్జీదారుల ఆశలు నెరవేర్చాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. …

Read More »

సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి అవసరం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన 17 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. 17 లక్ష్యాలలో 5వ లక్ష్యమైన లింగసమానత్వం సాధించి మహిళలకు సాధికారితను పెంపొందించేందుకు చేపట్టిన చర్యల …

Read More »

ఆల్వీన్‌ నిస్సాన్‌ క్యాబ్‌ స్టార్‌ వాహనాన్ని బహిరంగ వేలం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టిఆర్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయనికి చెందిన ఆల్వీన్‌ నిస్సాన్‌ క్యాబ్‌ స్టార్‌ వాహనాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 1989 సంవత్సరానికి చెందిన Aనూ 7918 నెంబర్‌ గల ఆల్వీన్‌ నిస్సాన్‌ వాహనాన్ని ప్రస్తుత కండిషన్‌లో ఎలా ఉన్నదో అలాగే విక్రయించేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం జరిగిందన్నారు. జూన్‌ 10వ తేదిన ఉదయం 11 గంటలకు విజయవాడ మొగల్రాజపురం బోయపాటి మాధవరావు వీధిలోని …

Read More »

వెబ్ ప్రోస్, సొల్యూషన్స్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేయుటకు వివిధ ఉద్యోగాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వెబ్ ప్రోస్, సొల్యూషన్స్, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో పనిచేయుటకు వివిధ ఉద్యోగాలలో 50 ఖాళీల భర్తీ కొరకు జూన్ 1వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం కంచరపాలెం లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (సాంకేతిక విభాగం) కె. సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెషిన్ / ప్యాకింగ్ హెల్పర్స్, డెలివరీ బాయ్స్ ఉద్యోగాల ఎంపిక …

Read More »

యువత క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేటి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈనెల 25న విజయవాడ నగరంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 మరియు 28, 29 తేదీలలో కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అథ్లెట్స్ సోమవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులకు …

Read More »

మూడేళ్ల సుపరిపాలనపై సెంట్రల్ వ్యాప్తంగా ఘనంగా సంబరాలు

-పేదల ఆకాంక్షలను నిజం చేస్తున్న జగనన్న సర్కార్ -ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే నిజమైన సంక్షేమం, అభివృద్ధి అని శాసనసభ వేదికగా చెప్పడమే కాకుండా.. ఆ దిశగా చర్యలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చారిత్రాత్మక విజయంతో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ …

Read More »

శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-63 వ డివిజన్ 273 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ – 273 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట ఆదరణ లభించింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ …

Read More »

మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ, నడి వేసవిలో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు ఉచితంగా అల్పాహారంపెట్టి, చల్లని మజ్జిగ వారికి అందచేయాలనే మానవత్వంతో కూడిన మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కొనియాడారు. సోమవారం ఉదయం కృష్ణా కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంకు వచ్చే పలువురు స్పందన అర్జీదారులకు ఉచిత మజ్జిగ అల్పాహార పంపిణీ శిబిరంను కలెక్టర్ పి. రంజిత్ బాషా, మచిలీపట్నం పార్లమెంట్ …

Read More »

పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువు పెంపు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని, వచ్చే నెల జూన్ 10 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణాజిల్లా కలెక్టర్ జి. రంజిత్ బాషా తెలిపారు. సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, కృష్ణా జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ పాప్టర్లకు గౌరవ వేతనంపై నూతన మార్గదర్శకాలతో ధరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. పాస్టర్ల గౌరవ వేతనం మంజూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని వీటిని అనుసరించి …

Read More »