Breaking News

తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్…

-ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గియ నందమూరి తారకరామారావు అని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. సోమవారం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.అద్దంకి రాజా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చలనచిత్ర రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రతో దూసుకుపోయిన నందమూరి తారకరామారావు వంటి నాయకుడు మరొకరు ఉండరన్నారు.సినిమా నటుడిగా ఏపాత్ర పోషించిన అందులో ఒదిగి పోయేవారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యం తో రాజకీయ రంగంలో అడుగుపెట్టి అక్కడ కూడా విజయం సాధించారన్నారు. ఎన్టీఆర్ లాంటి వారు యుగానికి ఒక్కరే పుడతారని అందుకే ఆయన ఈ శతాబ్దపు యుగపురుషుడని, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గనికి ఎన్టీఆర్ జిల్లా గా నామకరణం చేసి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి లక్ష్మీపార్వతి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ తన నటనా చాతుర్యం తో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ తన పాలనా నైపుణ్యం తో ప్రజల మనసులో అన్న గా కొలివైన నాయకుడని ప్రశంసించారు. డ్రీం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర సురేష్ మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు ఆచంద్రతారార్కం వెలుగొందుతూనే ఉంటారన్నారు. నిర్వాహకుడు డా.అద్దంకి రాజా యోనా మాట్లాడుతూ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తమ సంస్థ బాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు, నందమూరి తారకరామారావు పేరు తలచుకుంటేనే తెలియని ఆనందం కలుగుతుందని అటువంటి మహానుభావుని శతజయంతి ఉత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు డాక్టర్ గుంటి పిచ్చయ్య ఎన్టీఆర్ అభినయాన్ని చేసి ఆహుతులను మెప్పించారు. ప్రారంభించడానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ఎన్టీఆర్ చిత్ర పటానికి దండవేసి ఘనంగా నివాళులర్పించి, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ముద్రించిన ప్రత్యేక సంచిక ను ఆవిష్కరించారు. అనంతరం విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ముగ్గురికి పద్మశ్రీ డా. ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, ముప్పై మందికి ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలు ఇచ్చి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలిచ్చి ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో జాతీయ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత పారుపల్లి సురేష్, పర్యావరణ వేత్త చిలుకూరి శ్రీనివాస్ రావు, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు డా.గూటం స్వామి, కొల్లి రమావతి పాల్గొని ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *