Breaking News

సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి అవసరం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి సాధనకు నిర్థేశించిన 17 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. 17 లక్ష్యాలలో 5వ లక్ష్యమైన లింగసమానత్వం సాధించి మహిళలకు సాధికారితను పెంపొందించేందుకు చేపట్టిన చర్యల లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. వీటిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికి చేరువ చేయాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకాలతోపాటు అమూల్‌ పాలవెల్లువ, దిశ చట్టం అమలు, వైఎస్సార్‌ చేయూత, స్త్రీనిధి, వైఎస్సార్‌ కాపు నేస్తం వంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, పురుషులతో పాటు సమానంగా మహిళలకు విద్య అందించడం, బాల్య వివాహలు అరికట్టడం, మహిళలపై హింస, లైంగిక వేధింపులు అరికట్టడం ద్వారా మహిళా సాధికారితకు నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చునన్నారు. గోల్‌ నెంబర్‌ 11లో భాగంగా సమ్మిళిత, సురిక్షత నగరాల అభివృద్ధికి తోడ్పాటులో భాగంగా పట్టణాలు, నగరాలలో పూరిళ్ళు లేకుండా ప్రతీ ఒక్కరికి గృహాలను కల్పించడం, ఇంటింటి నుండి నూరు శాతం చెత్తను సేకరించడం, ప్రతి ఇంటికి వ్యక్తిగత టాయిలెట్లను నిర్మించడం,ఇంటింటికి డ్రైనేజ్‌ సౌకర్యం, మురుగునీటిని శుభ్రం చేయడం తదితర సౌకర్యాలను నూరు శాతం కల్పించడం ద్వారా సుస్థిరాభివృద్ధికి నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చునని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జడ్పిసిఇవో సూర్యప్రకాష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *