విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయనికి చెందిన ఆల్వీన్ నిస్సాన్ క్యాబ్ స్టార్ వాహనాన్ని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 1989 సంవత్సరానికి చెందిన Aనూ 7918 నెంబర్ గల ఆల్వీన్ నిస్సాన్ వాహనాన్ని ప్రస్తుత కండిషన్‌లో ఎలా ఉన్నదో అలాగే విక్రయించేందుకు ఉన్నతాధికారులు అనుమతించడం జరిగిందన్నారు. జూన్ 10వ తేదిన ఉదయం 11 గంటలకు విజయవాడ మొగల్రాజపురం బోయపాటి మాధవరావు వీధిలోని ఉప కార్య నిర్వహక సమాచార ఇంజనీర్ జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయం నందు బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొన్నదలచిన వారు ముందుగా రూ.1000/` ధరావత్తు సొమ్మును చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. వేలం ముగిసిన పిదప ధరావత్తు సొమ్ము తిరిగి ఇవ్వబడుతుందన్నారు. వేలంలో వాహనాన్ని దక్కించుకున్న వారు పాడిన సొమ్ముకు అధనంగా 18 శాతం జిఎస్‌టి చెల్లించవలసి ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలలోపు పూర్తి సొమ్మును చెల్లించి వాహనాన్ని స్వాదీనం చేసుకోవాలని సురేంద్రనాద్ ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 91212 15348 నెంబరుకు సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News