పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువు పెంపు !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పాస్టర్లకు గౌరవ వేతనానికి దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించిందని, వచ్చే నెల జూన్ 10 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కృష్ణాజిల్లా కలెక్టర్ జి. రంజిత్ బాషా తెలిపారు. సోమవారం ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, కృష్ణా జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ పాప్టర్లకు గౌరవ వేతనంపై నూతన మార్గదర్శకాలతో ధరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. పాస్టర్ల గౌరవ వేతనం మంజూరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసిందని వీటిని అనుసరించి ఇకపై పాస్టర్లు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన తెలిపారు. నూతన మార్గదర్శకాల ప్రకారం, సొసైటీ లేదా ట్రస్ట్ పేరుతో చర్చి రిజిస్టర్ అయ్యి ఉండాలన్నారు. చర్చి స్థలం సొసైటీ లేదా ట్రస్ట్ పేరుతో ఉన్న డాక్యుమెంట్ కానీ , తహసిల్దార్ పొజిషన్ కాపీ ఉండాలన్నారు. లేదా సొసైటీ లేదా ట్రస్ట్ పేరుతో స్థలం ఇచ్చిన జాతచే రిజిస్టర్డ్ నోటర్, కాపీ వీటి ఒకటి సమర్పించాలన్నారు. అద్దె భవనంలో నడుపుతున్న చర్చికి సొసైటీ, లేదా ట్రస్ట్ పేరుతో అద్ది లీజు ఒప్పందం నోటర్ చేసిన కాపీ ఉండాలన్నారు. వీఆర్వో కానీ లేదా వెల్ఫేర్ , ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీచే జారీ చేసిన చర్చి ధృవీకరణ పత్రమును జత చేయాలని చెప్పారు. చర్చి పేరుతో బ్యాంకు అకౌంట్ నెంబర్ పాస్ బుక్ మొదటి పేజీ కాపీ ఉండాలని సూచించారు. అలాగే చర్చికి ఆదాయం లేదని చర్చి నిర్వాహకులు లేదా చర్చి పాస్టర్ ఎవరో ఒకరు స్వీయ ధృవీకరణ పత్రం కాపీ జత చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కోబ్న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *