మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని తల్లిదండ్రులకు పిల్లలను, పిల్లలకు తల్లిదండ్రులను దూరం చేసిందని అంతటి దైన్య స్థితిలో ఎంతో మంది చిన్నారులు జీవితంలో ఎంతో దైర్యంగా నిలబడ్డారని వారందరికీ కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని వారిని అన్ని విధాలా అదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.
కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్ట్యువల్ విధానంలో ప్రారంభించారు.
సోమవారం ఉదయం స్థానిక జిల్లా కల్లెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా, ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సువర్ణ లక్ష్మి పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ( కృష్ణాజిల్లాలో 17 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 8 మంది కాగా ఇటీవల ఏలూరు జిల్లాలో విలీనం కాబడిన నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు చిన్నారులు ) మొత్తం 28 మంది చిన్నారులు కోవిడ్ కారణంగా అనాథలుగా మిగిలారు. ఈ చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు పొందేందుకు వీరు అర్హులయ్యారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, దేశంలో కోవిడ్ కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికి విదితమేనని చెబుతూ , అందులో స్కూలుకెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారని అన్నారు. . దీంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారని అలాంటి పిల్లల్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిందే పీఎం కేర్స్ పథకం అని పేర్కొన్నారు. ఈ స్కీమ్లో భాగంగా తల్లిదండ్రులు మరణించిన తేదీ నాటికి పిల్లలకు 18 ఏళ్లు నిండని పిల్లల చదువు, ఆరోగ్యం ఇతరాత్ర అన్నీ ప్రయోజనాల్ని అందించేలా కేంద్రం, రాష్ట్రం చర్యలు తీసుకుందని . ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత నెలవారీ స్టైఫండ్ చొప్పున 23 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు రూ.10 లక్షల మొత్తాన్ని అందిస్తుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రూ.10 లక్షల రూపాయలను వీరికి అందచేస్తున్నట్లు వివరించారు. ఈ పథకానికి 11, మార్చి 2020 – 28, ఫిబ్రవరి 2022లోపు మధ్య కాలంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారు మాత్రమే అర్హులని అన్నారు. ఈ పథకం ద్వారా అందే నిధులతో పిల్లలు సొంత శక్తితో ఎదగగలుగుతారని, ఆ మొత్తం నిధులు చిన్నారుల వికాసానికి తోడ్పడతాయని పీఎం కేర్స్ ద్వారా సాయం చిన్నారులకు 23 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకం కొనసాగుతుందని తెలిపారు.
గతేడాది మే 29న మోదీ ఈ పథకాన్ని ప్రకటించారని చెబుతూ, కోవిడ్ కారణంగా తల్లీ, తండ్రీ ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులు..వారిని దత్తత తీసుకున్నవారు, సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న వాళ్లను కోల్పోయిన పిల్లలతోపాటు కరోనా కారణంగా తమకు ఆర్థికంగా, అండగా నిలబడే వాళ్లను కోల్పోయిన పిల్లలు ఈ పథకానికి అర్హులని ఎం పి అన్నారు. ఈ పథకం ద్వారా అలాంటి చిన్నారులకు స్కాలర్షిప్ల రూపంలో ఆర్థిక సాయం అందుతుందని నిధులు అందే పి ఎం కేర్ పాస్బుక్ను, ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమా హెల్త్ కార్డులను చిన్నారులు పలువురుకికి మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అందజేశారు. బాలల కోసం సిఎం కెర్స్ ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యాభ్యాసానికి విద్యారుణ సదుపాయం లభ్యమవుతుందని, అలాగే విద్యారుణం వడ్డీ భారాన్ని సీఎం కేర్స్ భరిస్తుందన్నారు. 23 సంవత్సరాల వయసు వరకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం ఉందన్నారు.ఆరోగ్య బీమా ప్రీమియం సిఎం కేర్స్ భరిస్తుందని 18 సంవత్సరాల వయసు వరకు వ్యక్తిగత అవసరాలకు నెలవారీ ఆర్థిక సహాయంతో పాటు 23 సంవత్సరాల వయసు నిండిన వెంటనే పిఎం కేర్స్ నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం పొందే సదుపాయంతో పాటు 1-12 తరగతుల మధ్యన పిల్లలకు ఏడాదికి రూ.20,000 స్కాలర్ షిప్ నైపుణ్య శిక్షణకు కర్మ స్కాలర్ షిప్ టెక్నికల్ విద్యకు స్వనత్ స్కాలర్ షిప్, అలాగే రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి సి పి ఓ వై. జాన్సన్, సి డి పి ఓ భానుమతి, దీప్తి, సి డబ్ల్యు సి చైర్ పర్సన్ సువార్త, బెరాకా స్వచ్ఛంద సేవ సంస్థ కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News