మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయం… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ, నడి వేసవిలో దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు ఉచితంగా అల్పాహారంపెట్టి, చల్లని మజ్జిగ వారికి అందచేయాలనే మానవత్వంతో కూడిన మంచి ఆలోచన తమ సిబ్బందికి రావడం ఎంతో అభినందనీయమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా కొనియాడారు. సోమవారం ఉదయం కృష్ణా కలెక్టరేట్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంకు వచ్చే పలువురు స్పందన అర్జీదారులకు ఉచిత మజ్జిగ అల్పాహార పంపిణీ శిబిరంను కలెక్టర్ పి. రంజిత్ బాషా, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా సందర్శించారు. జిల్లా కలెక్టర్ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య దాతలుగా వ్యవహరించిన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త స్వచ్చ యార్లగడ్డ రధ సారధి, సీనియర్ అసిస్టెంట్ తూము వెంకటేశ్వరరావు, మజ్జిగను వితరణ ఇవ్వగా, అంబటి శేషుబాబు (సాక్షి రిపోర్టర్ కలెక్టరేట్) పులిహోరను వితరణగా అందించారు. యం.వి. శ్యాంనాద్,డిప్యూటీ తహసిల్దార్ టెంట్ హౌస్ ను సమకూర్చారు. సోమవారం దాదాపు 500 మందికి మజ్జిగ , పులిహోర పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉన్నతాధికారులు,పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *