Andhra Pradesh

జాతీయ రహాదారులకు ప్రారంబోత్సవం కార్యక్రమాలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 17వ తేదీన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఈనెల 17 తేదీన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఇందీరాగాంథీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రలో …

Read More »

2023 ఏప్రిల్‌ 14న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవం…

-పిడబ్ల్యూ గ్రౌండ్‌లో శరవేగంగా పనులు… -నిధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రీన్‌ ఛానల్‌లో పెట్టాం… -ఇప్పటికే వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేశాం… -పన్నెండున్నర అడుగుల నమూనా స్టాట్యూ ఏర్పాటు చేశాం… -మంత్రులు, శాసన సభ్యులు, ప్రజలు విగ్రహాన్ని పరిశీలించి చేసిన సలహాలు సూచనలు, అభిప్రాయాల మేరకు తుది కాంస్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2023 ఏప్రిల్‌ 14 న డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ కాంస్య విగ్రహం, స్మృతివనం ప్రారంభోత్సవానికి స్వరాజ్‌ మైదానంలో పనులు …

Read More »

నూజివీడు డివిజన్ లో 3 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో ఫిబ్రవరి 14వ తేదీన 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగిరిపల్లి మండలంలో 2, ఏ. కొండూరు మండలంలో 1 కేసు నమోదయ్యాయన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలి : అధికారులకు ఆర్డీఓ రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్ధానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో సోమవారం స్పంధన కార్యక్రమంలో ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబందిత అధికారులకు ఫోన్ చేసి అదేశాలు జారీ చేశారు. . ఈ సందర్బంగా ఆర్డీఓ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ స్పందన దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వద్దని, జాప్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పేదప్రజలు తమ …

Read More »

మ‌న పోలీసువ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శం…

-రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి పాముల పుష్ప‌శ్రీ‌వాణి -టూటౌన్ పోలీస్ స్టేష‌న్ కొత్త‌భ‌వ‌నం ప్రారంభం విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శ‌మ‌ని, రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి శ్రీ‌మ‌తి పాముల పుష్ప‌శ్రీ‌వాణి పేర్కొన్నారు. ఆంధ్రా పోలీస్‌…ఆద‌ర్శ పోలీస్ అని ప్ర‌శంసించారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని కొత్త‌పేట వ‌ద్ద నూత‌నంగా నిర్మించిన టూటౌన్ పోలీస్ స్టేష‌న్ భ‌వ‌నాన్ని సోమ‌వారం ఆమె ప్రారంభించారు. పోలీసుల‌నుంచి గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి నేతృత్వంలో మ‌న రాష్ట్ర పోలీసు వ్య‌వ‌స్థ …

Read More »

హైకోర్టులో 7గురు నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన హైకోర్టు సిజె.పికె.మిశ్రా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో సోమవారం ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు నూతన న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి,జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్,జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి,జస్టిస్ వడ్డిబోయన సుజాత లచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

Read More »

మహిళా సాధికారతకు పటిష్ట కృషి…

-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ -మహిళా కమిషన్ సభ్యుల ప్రమాణస్వీకారం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో నూతనంగా నియమించిన కమిషన్‌ సభ్యులతో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత సాధనకు విస్తృతంగా కృషిచేసేందుకు కమిషన్ తరఫున కంకణబద్ధులై ఉన్నామని చెప్పారు. ఇప్పటికే ఇద్దరు సభ్యులు (గజ్జల వెంకట జయలక్ష్మి, కర్రి జయశ్రీ) ఉండగా.. ప్రస్తుతం మరో …

Read More »

బాబా ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-రాజీవ్ నగర్లో వైభవంగా శ్రీ షిర్డి కృష్ణసాయి బాబా 13 వ వార్షికోత్సవ మహోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం రాజీవ్ నగర్లోని శ్రీ షిర్డి కృష్ణసాయి బాబా వారి 13 వ వార్షికోత్సవ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి ఉదయం కాగడా హారతి, క్షీరాభిషేకం, అన్ని నదులు పుణ్య జలాలతో జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గులాబీలతో సహస్రనామార్చన పూజా కార్యక్రమం, అమృత వర్షిణి గోష్ఠి వారిచే సాయి సత్చరిత్ర పారాయణం జరిగాయి. సాయంత్రం రథోత్సవము, …

Read More »

చేతివృత్తిదారులలో ఆత్మవిశ్వాసం నింపిన జగనన్న చేదోడు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-అర్హులందరూ లబ్ధి పొందేలా మార్చి 11 వరకు గడువు పెంపు -ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేతివృత్తిదారుల అభివృద్ధే లక్ష్యంగా జగనన్న చేదోడు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ నగదు విడుదల చేసిన నేపథ్యంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బీఆర్టీఎస్ బస్టాప్ వద్ద …

Read More »

పెనమలూరులో ఘనంగా ఆలయ ప్రతిష్ఠ…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక శ్రీహనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీకోదండరామస్వామి ఆలయ చిన్నగుడి పునః ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గ్రామ ప్రధాన వీధులు కిటకిటలాడాయి. ధ్వజస్తంభ, శిఖర, జయ, విజయ ద్వార పాలకుల విగ్రహాలకు పూజలు నిర్వహించి ప్రతిష్టించారు. భారీ ఉన్న సమారాధన జరిగింది. సాయంత్రం రామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా సాగింది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారది, దేవాదాయ శాఖ డీఈఈ శ్రీనివాసరావు, సహాయ కమిషనర్ …

Read More »