-కమిషనర్ పి. రంజిత్ భాషా, ఐ. ఏ. ఎస్. వెల్లడి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడుతుందని, ప్రజలు నేరుగా తమ యొక్క సమస్యల అర్జీలను అధికారులకు అందించవచ్చునని కమిషనర్ తెలిపారు.
Read More »Andhra Pradesh
అత్యాధునిక ‘ఆర్మర్’ కార్ డిటైలింగ్ స్టూడియో ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఆర్మర్’ డిటైలింగ్ స్టూడియో విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఇంద్రప్రస్థ హోటల్ ఎదురుగా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్థన్ చేతుల మీదుగా శనివారం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ‘ఆర్మర్’ స్టూడియో అధినేతలు సయ్యద్ హమీద్, సయ్యద్ జువేద్‌లు మాట్లాడుతూ విజయవాడ నగరంలో అత్యాధునిక డిజైన్లు ఆటోరంగంలో కార్లకు నూతన ఒరవడి సృష్టిస్తామని అన్నారు. మావద్ద నిపుణులు అయిన టెక్నిషన్స్ వారిచే బి.పి.ఎఫ్., సిరామిక్, డిటైలింగ్, రాఫ్, టిపులాన్, సన్‌ఫిల్మింగ్ మొదలగు ఇంటీరియల్ కార్లకు బ్యూటీఫికేషన్ …
Read More »వి.ఐ.టి.-ఏ.పి విశ్వవిద్యాలయంలో 3 రోజుల రెండవ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో 3 రోజుల రెండవ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (AISP ’22 ) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో శనివారం ప్రారంభమయ్యింది. ఈ సదస్సును IEEE గుంటూరు సబ్ సెక్షన్ తో కలిసి, IEEE హైదరాబాద్ సెక్షన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వైస్ ప్రెసిడెంట్ డేటా సెంటర్స్ మరియు ఏ ఐ గ్రూప్, ఇంటెల్ కార్పొరేషన్ శ్రీనివాస్ లింగం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ …
Read More »ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది…
-కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సూచించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరితే కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుందని అన్నారు. వైఎస్సార్ …
Read More »ధాన్యం కొనుగోళ్ళకు జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలి…
-జిల్లాలో ఇప్పటి వరకు 70, 863 ముంది రైతుల నుండి 1289.42కోట్ల రూపాయాల విలువైన 6లక్షల,59వేల,174 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం… -జాయింట్ కలెక్టర్ డా.కె మాధవి లత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. డయల్ యువర్ జేసి కార్యక్రమంలో భాగంగా శనివారం జాయింట్ కలెక్టర్ మాధవీలత నగరంలోని క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన కార్యక్రమంలో 37 మంది రైతులు తమ సమస్యలను తెలియజేశారు. …
Read More »ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు మరింత పెరిగాలి…
-వైద్య సిబ్బందికి సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశం. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు,ఆరోగ్యశ్రీ సేవలు, లింగస్థ పిండ నిర్ధారణ పరీక్షల నియంత్రణ, తదితర అంశాలపై శనివారం విజయవాడ డివిజన్లోని సిహెచ్ సి, పి.హెచ్.సి., వైద్యులు, అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ …
Read More »పెండింగ్ లో ఉన్న జగనన్న కాలనీల లే ఔట్లలో మౌలిక సదుపాయలకు అంచనాలు వెంటనే సమర్పించండి…
-తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ఆదేశం. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న జగనన్న కాలనీల లే ఔట్లలో మౌలిక సదుపాయలకు అంచనాలు వెంటనే సమర్పించాలని సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం జగనన్న లే ఔట్లలో మౌలిక సదుపాయాల కల్పనపై తహశీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఎటువంటి …
Read More »నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఓ వరం…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. లక్ష విలువైన ఎల్ఓసి పత్రం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిది ఓ వరమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్ కు చెందిన లంకా పరశురాం గత కొద్దికాలంగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక దుస్థితిని శాసనసభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. రూ. లక్ష విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో ఎల్ఓసి పత్రాన్ని …
Read More »కష్టజీవుల జీవితాల్లో వెలుగులు నింపిన జగనన్న చేదోడు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతుల మీదుగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కష్టజీవులకు తోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ నగదు విడుదల చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి బుడమేరు మధ్యకట్ట వద్ద పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, …
Read More »గోవు సమస్త దేవతా స్వరూపం…
-గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గోపూజ ముక్కోటి దేవతల పూజా ఫలంతో సమానమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణపురం జి.ఎస్. రాజు రోడ్డు నందు గోకులం ఆధ్వర్యంలో జరిగిన సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గోమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ …
Read More »