Breaking News

Andhra Pradesh

గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణలకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ  వారి  గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియొజకవర్గం, హిందూ హైస్కూల్ ఎదురు సందు, వట్టూరి వారి వీధి, సాయిబాబా కార్ ట్రావెల్స్ వద్ద నాయీ బ్రాహ్మణ సోదరులకు 1000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. ఈ సంధర్భంగా నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు చిప్పాడా మారుతి రావు, ఆంధ్ర ప్రదేశ్ బి.సి.చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.రామారావులు మాట్లాడుతూ గొలగాని …

Read More »

జాతీయ రహదారి వెంబడి వర్షపు నీరు పారుద‌ల‌కు చర్యలు చేపట్టాలి… : కమిషనర్ ప్రసన వెంకటేష్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కనకదుర్గమ్మ వారధి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు గల జాతీయ రహదారిలో పారిశుధ్య నిర్వహణ మరియు గ్రీనరి పనులను గురువారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పరిశీలించారు. జాతీయ రహదారి వెంబడి పల్లంగా ఉన్న రోడ్ మర్జిన్స్ నందు వర్షపు నీరు నిలిచి యుండుట గమనించి అధికారులకు పలు సూచనలు చేసారు. భారతీనగర్ నోవేటెల్ హోటల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రెయిన్ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించుట గమనించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు …

Read More »

తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్… : జి.రవికుమార్ 

-వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సందర్భంగా వైయస్ఆర్ సిపి యువజన …

Read More »

పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైయస్ఆర్ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేదప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని, అందుకే నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి  72 వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు …

Read More »

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలలో ఒగ్గు గవాస్కర్ దాతృత్వం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం 32 వ  డివిజన్ అయోధ్య నగర్ ఏరియా నందు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కార్యాలయం లో  మాజీ ముఖ్యమంత్రి  స్వర్గీయ  వై యెస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, ఎమ్మెల్యే  మల్లాది విష్ణు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, చేసి తదనంతరం కరోనా కష్టకాలంలో అలుపెరగకుండా కష్టపడిన …

Read More »

11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్‌ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు …

Read More »

పేద ప్రజల సంక్షేమ పథకాల సంక్షేమ రారాజు వైయస్సార్… : కర్ర జయ సరిత

పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు పాలకొల్లులో వైయస్సార్ సిపి నాయకురాలు, న్యాయవాది, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కర్ర జయ సరిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్ర జయ సరిత మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి అభివృద్ధిని జెట్ స్పీడ్ వేగంతో పరుగులు పెట్టించి పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి బ్రాండ్ అంబాసిడర్ …

Read More »

ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి మెలిసి జీవించాలి… : మేదర సురేష్ కుమార్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ స్నేహాభావంతో, మానవ దృక్పధంతో కలిసి, మెలిసి జీవించాలని బైబిల్ లో ఉందని వరల్డ్ హీలింగ్ డే రాష్ట్ర కో ఆర్డినేటర్ మేదర సురేష్ కుమార్ తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ హీలింగ్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేదర  సురేష్ కుమార్ మాట్లాడుతూ 148 దేశాలు ప్రపంచ పుస్తక దినోత్సవం ని జరుపుకుంటూ మానవులందరూ కలిసిమెలసి జీవించాలని ఇప్పుడున్న ఈ సమయంలో ఎన్నో …

Read More »

ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే… : పవన్‌ కల్యాణ్

-జనసేన బలోపేతానికి కృషి చేయాలి… -జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్‌ కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం  మాట్లాడుతూ ‘‘కరోనా విపత్తులో …

Read More »

ప్రతి ఒక్కరిలోనూ ధీమా పెంచిన ఆనందయ్య మందు…

– ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా నివారణకు ఆనందయ్య మందు తీసుకున్నప్పటికీ వాక్సిన్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాల్సిన అవసరం ఉందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు తెలిపారు. ఆనందయ్య మందు తీసుకుంటే వాక్సిన్ అవసరం లేదనే జరుగుతున్న ప్రచారం సరైనదికాదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న వాక్సిన్ తో పాటు ఆనందయ్య మందు కూడా తీసుకుంటే మరింత మంచిఫలితాలు ఉంటాయన్నారు. ఏపీ కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సహకారంతో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ ఆధ్వర్యంలో 300 మంది …

Read More »