Breaking News

Latest News

సిఎస్ గా డా.సమీర్ శర్మ సేవలు అభినందనీయం-ఉద్యోగులందరికీ ఆదర్శనీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మ రాష్ట్రానికి అందించిన సేవలు అభినందనీయమైనవని నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు,ఉద్యోగులు కొనియాడారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డా.సమీర్ శర్మ నవంబరు 30వతేదీ బుధవారం పదవీ విరమణ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్యర్యంలో వీడ్కోలు,స్వాగత కార్యక్రమం జరిగింది.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి …

Read More »

ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డా.కెఎస్.జవహర్ రెడ్డి

-ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పధకం చివరి వ్యక్తి వరకూ చేరేలా కృషి -అభివృద్ధి సంక్షేమ పధకాలు నూరు శాతం సక్రమ అమలుకు యంత్రాంగాన్నినడిపిస్తా -సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి అందేలా కృషి చేస్తాను -సిఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు సియంకు ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డా.సమీర్ శర్మ పదవీ కాలం నవంబరు 30వ తేదీతో …

Read More »

ఢిల్లీ నుండి ఏ పి విశాఖ జయంతి రైల్ బోగీలో నేటి గాంధీ ఉపవాస దీక్ష

-కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి గాంధీ,అంబెడ్కర్ పేర్ల పెట్టాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి జాతిపిత మహాత్మాగాంధీ పేరు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని, అలాగే పార్లమెంట్‌ భవన్‌ ప్రాంగణంలో వారిద్దరి భారీ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని నేటి గాంధీ ఆర్‌ ఆర్‌ గాంధీ నాగరాజన్‌ డిమాండ్‌ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు గురైన 1948 జనవరి 30 తేదీని గుర్తు చేస్తూ..ప్రతినెలా 30 తేదీన కళ్ళకు గంతలు కట్టుకొని ఉపవాస దీక్షలు …

Read More »

పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనదే ప్రభుత్వ లక్ష్యం…

-జిల్లాలో నాల్గవ విడత రూ. 30.50 కోట్లు 37,736 మంది తల్లుల ఖాతాలలో జమ.. -జగనన్న విద్య దీవెనతో లక్ష్యాలను సాధించండి. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యకు పేదరికం అడ్డుకాకుడదన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అందించే పూర్తి ఫీజు రీయంబర్సుమెంట్‌ తో ప్రతీ విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ …

Read More »

నిర్మాణ పనులు మొదలైన 30 మాసాల్లొ బందరు పోర్టు సిద్ధం… : మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని

-జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ముఖ్యమంత్రి స్వహస్తాల మీదుగా పనుల నిర్మాణానికి శంకుస్థాపన -విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు పోర్టు నిర్మాణం మొదలైన 30 మాసాల్లొ శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇంజినీరింగ్ సంస్థతో ఒప్పందం చేసుకోనుందని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక ఆర్ …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కళాశాల సిబ్బంది ఘన సత్కారం

-అడ్మిషన్ల పునరుద్ధరణలో మల్లాది విష్ణు చూపిన చొరవ మరువలేనిది: కళాశాల సిబ్బంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గవర్నర్ పేట లోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కళాశాల సిబ్బంది బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహితసదనములో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిశారు. కళాశాలలో అడ్మిషన్ల పునరుద్ధరణకు ఆయన అందించిన సహాయ సహకారాలకుగానూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ కళాశాల నందు ఈ …

Read More »

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి

-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నందమూరి నగర్ నుంచి పైపుల రోడ్డు కూడలి వరకు విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు …

Read More »

అభివృద్ధి కార్యక్రమాల పనులు వేగవంతం చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన తూర్పు నియోజకవర్గంలోని 2,3,4,5,6,7 డివిజన్లకు సంబంధించి పెండింగులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు నూతనంగా మంజూరు అయిన పనులు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు అవినాష్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారం గురుంచి ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ఇన్ ఛార్జ్ లతో జరిగిన సమీక్ష సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ …

Read More »

ఉన్నత విద్యాతోనే పేదరిక నిర్మూలన సాధ్యం – దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యం తో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం ఉన్నతమైన చదవుల వల్లనే పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమని,అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత …

Read More »

వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 12వ సచివాలయం పరిధిలోని హరిజనవాడ ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన …

Read More »