గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ విభాగాధిపతులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించి, ఇటీవల మరణించిన కార్మికురాలు కుటుంబ సభ్యులకు అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తో కలిసి ఎక్స్గ్రేషియా చెక్ ను అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »Latest News
సమస్యలు పరిష్కారం అవ్వకపోతే ఆమరణ దీక్ష కైనా సిద్ధం !
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రైల్వే డివిజన్లో దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రశ్నించే దళితుల్ని అనగద్రోకుతున్నరని చైతన్య భారతి సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బి చిట్టి రాజు అన్నారు. గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా దళితులకు ఇంకా స్వాతంత్ర్యం రాలేదని విచారం వ్యక్తం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్లో మూడు వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. క్రమశిక్షణ చర్యలు అంటూ దళిత ఉద్యోగులపై …
Read More »మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిది
-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు -31వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడప గడపలో సంక్షేమ కాంతులు వెల్లివిరుస్తున్నాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 31 వ డివిజన్ 211 వ వార్డు సచివాలయం పరిధిలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి గడపగడపకు …
Read More »శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ని కలిసి దేవినేని అవినాష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వ శాంతి కోరుతూ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు చేపట్టిన 600 మంది భక్తులతో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర సందర్భంగా విజయవాడ లో పటమట శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ మర్యాదపూర్వంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
Read More »రెడ్‌క్రాస్ సేవలలో ఉద్యోగుల సహకారం అభినందనీయం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపద సమయాలలో ప్రజలకు సేవలందించడంలో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి అందిస్తున్న సేవలలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యులు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటికి సహకారం అందించేందుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు ఏపి హౌసింగ్ కార్పొరేషన్ ఎన్‌టిఆర్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి, మరియు ఉద్యోగులు స్పందించి 59 వేల 2 వందల రూపాలయను గురువారం కలెక్టర్ కార్యాలయంలో …
Read More »చక్కటి అనుభూతికి ఆహ్లాద భరిత ఉద్యానవనములు
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు నగరoలోని రాజీవ్ గాంధీ పార్కు ఆధునీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, మరియు మిగితా వి.యమ్.సి అధికారులతో కలిసి పార్కును సందర్శించినారు. పార్కు ఆవరణ మొత్తము పరిశీలన జరిపి ఏయే ప్రాంతములలో ఏ విధమైన ఏర్పాటు చేయవలెనో గుర్తించి చుట్టూ విశాలముగా సౌకర్యవంతముగా ఉండునట్లు చూడవలెనని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పార్కు …
Read More »శుక్రవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజమహేంద్రవరం పర్యటన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి అధికారులు, ఆయుష్ విభాగం వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేసి, అనంతరం ఆనం కళా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ …
Read More »అభినందనలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార కమీషన్ కు కొత్తగా చీఫ్ కమీషనర్ గా మరియు కమీషనర్ లుగా నియమితులైన సీనియర్ జర్నలిస్ట్ లు ఆర్. మహబూబ్ భాషా, పి. శామ్యూల్ జోనతన్ లను విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు టెలికాం సలహ కమిటి ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు గురువారం రాష్ట్ర సమాచార కమీషన్ కార్యాలయంలో వారిని కలిసి అభినందించారు. ఈ సందర్భంగా నిమ్మరాజు చలపతిరావు మాట్లడుతూ ముఖ్య వార్తా కధనాల కోసం జర్నలిస్ట్ లకు …
Read More »టిడిపి అధినేత చంద్రబాబు కర్నూల్ పర్యటన నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యలు
-టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానిలో 90% శాతం పూర్తయిన పేదల ఇళ్ళు రంగులు వేసి లబ్ధిదారులకు ఇవ్వలేని వైసిపి ప్రభుత్వం మూడు రాజధానిలు కడతాం అనటం హాస్యాస్పదమని, రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి రంగులు వేసి ప్రజా ధనాన్ని వృదా చేసి కోర్టులలో చివాట్లు తిన్నారే కానీ ఆ వ్యయాన్ని కర్నూలు , విశాఖ జిల్లాల్లో టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో గృహాలకు వెచ్చించలేకపోయారని, వైసీపికి ప్రజల మీద ఎంత …
Read More »సీనియర్ పాత్రికేయులకు సత్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గా మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోలా అజయ్ వహించారు. జాతీయ పత్రిక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు అయినా ఈనాడు గిరి కుమార్, సాక్షి బాబు మరియ ఏపీ టీఎస్ రిపోర్టర్ శివాజీ కి మన ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరంసీనియర్ పాత్రికేయుల …
Read More »