Breaking News

Latest News

ట్రీ & వుడ్ షెడ్డర్ మిషన్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలన…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, గురువారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సర్కిల్-3 పరిధిలో గల 10 వ డివిజన్ నందు వాసవి నగర్ లో ట్రీ & వుడ్ షెడ్డర్ మిషను సందర్శించారు. అక్కడ ఉన్నటువంటి మిషను పనుల వివరాలు అధికారులను అడిగితెలుసుకొని దానిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. నగరంలో ఉన్నటువంటి పార్కులలో, కాలనీలలో, మెయిన్ రోడ్ల పైన విద్యుత్తు శాఖ మరియు …

Read More »

నగరంలో అందుబాటులో కి శ్రీ మణి ఆటో కన్సల్టెన్సీ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, మాచవరంలోని ప్రముఖ దాసాంజనేయ స్వామి గుడి ఎదురుగా టూ వీలర్స్ వాహనదారులకు అందుబాటులోకి శ్రీ మణి ఆటో కన్సల్టెన్సీ, శ్రీ మణి బైక్ మెకానిక్ వర్క్స్ ప్రారంభించారు. గురువారం ప్రారంభించబడిన ఈ సందర్భంగా నిర్వాహకులు జె. శివ గంగాధర్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకముల, అన్ని కంపెనీల ద్విచక్ర వాహనాలు కొనడంతోపాటు అమ్మకాలు కూడా జరుగుతాయని తెలిపారు. సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు అందుబాటు ధరలలో కండిషన్లో ఉన్న మంచి వాహనాలు కస్టమర్లకు అందజేస్తామన్నారు. …

Read More »

46వ డివిజన్ లో మేయర్ రాయన భాగ్యలక్ష్మి జన్మదిన వేడుక‌లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46వ డివిజన్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జన్మదిన వేడుక‌లు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్ల, కొనకల్ల విద్యాధరరావు, కొండపల్లి బుజ్జి తదితరులు హాజరై భారీ కేక్ క‌ట్ చేసి నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్బంలో వారు మాట్లాడుతూ నగర మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నగర అభివృద్ధికి పాటుపడుతూ నగరాన్ని సుందరంగా …

Read More »

మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి… : కొట్టేటి హనుమంతరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి, మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు.  గురువారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొట్టెటి హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కబ్జాకోరుగా పేరుగాంచిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిని మరిచిపోయి, మంత్రిగా అభివృద్ధిని పరివేక్షించి దగ్గరుండి చేయాల్సిన బాధ్యత మానేసి, ఎక్కడ …

Read More »

చదువు జ్ఞానాన్ని అందిస్తే, ఆటలు ఆరోగ్యాన్ని అందిస్తాయి… : మంత్రి ఆర్ కె రోజా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వటానికి శాప్ హ్యాండ్ బాల్ అకాడమీని ఏర్పాటు చేయటం జరిగిందని రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా తెలిపారు. బుధవారం తెనాలి లోని ఎఎస్ఎన్ స్టేడియంలో శాప్ హ్యాండ్ బాల్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడలు మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, …

Read More »

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం హాజరుకానున్న కేంద్ర మంత్రి నారాయణస్వామి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా కులాల హెచ్చుతగ్గులు అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేస్తున్న సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన ఆదివారం ఉదయం విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో “సమరసత సమ్మేళనం” జరుగుతుందని సంస్థ జాతీయ కన్వీనర్ కే.శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు 1917 నవంబర్ 9, 5 ,6 తేదీలలో విజయవాడ కృష్ణా నది తీరాన గల ప్రముఖులు శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎమ్. రమణా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎమ్. రమణా రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లోని ఆర్ అండ్ బి భవన్ లో ఏ పి టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జి.ఓ. ఆర్. టి. నెం. 2279, తేదీ 31-10-22 ద్వారా  ఎమ్. రమణా రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్ గా ఈసంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన రమణా రెడ్డిని జనరల్ మేనేజర్ …

Read More »

గ్రాడ్యుయేట్‌ ఓటు నమోదు పై అవగాహనా క్యాంపైనింగ్‌ పెంచాలి…

-కాల పరిమితి పెంచాలి… -ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుండుపల్లి సతీష్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్‌ (పట్టభద్రుల) ఓటు నమోదు పై అవగాహనా క్యాంపైనింగ్‌ ముమ్మరం చేసి, ఓటు నమోదు కార్యక్రమం కాల పరిమితి పెంచవలసినదిగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాని బుధవారం కలిసి వినతిపత్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అడ్వకేట్‌ గుండుపల్లి సతీష్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు పై అవగాహనా క్యాంపైనింగ్‌ ముమ్మరం చేయాలని.. …

Read More »

ఏపీఎస్పీఎఫ్ సమస్యల పరిష్కారదిశగా చర్యలు

-ఎస్.ఐ.లకు సత్వర పదోన్నతి, ఖాళీల భర్తీ, హెడ్ క్వార్టర్, డాగ్ స్క్వాడ్ ఏర్పాటు తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి సత్వర పరిష్కారానికి తగు చర్యలను తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ఏపీఎస్పీఎఫ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. …

Read More »

టెండర్ల పై సమీక్షా సమావేశము నిర్మాణలు వేగవంతం చేయండి

-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు బుధువారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, నగరపాలక కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్ తో కలసి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో మరియు కాంట్రాక్టర్ల తో టెండర్ల పై సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ మాట్లాడుతూ గడప గడపకు …

Read More »