Breaking News

Latest News

సంక్షేమ పాలనతో ప్రతి గడపలో సంతోషం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనతో గడప గడపలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 3వ డివిజన్ 12వ సచివాలయ పరిధిలోని ప్రాంతాల్లో వైస్సార్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్ లతో కలిసి ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా అందుతున్న పథకాల వివరాల కరపత్రాలు అందజేశారు. అదేవిధంగా ఏదైనా సాంకేతిక కారణాల …

Read More »

మంచి చేస్తున్న జగనన్నను మనసారా దీవించండి… : మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ మనసారా దీవించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బుధవారం ఆయన పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయం పరిధిలోగల శేరివత్తర్లపల్లి, దిరిశవల్లి, మర్రిగుంట, చినపుల్లపాడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల పథకాల లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం …

Read More »

నగరంలో ఎస్ ఎస్ ఎస్ ఛారిటబుల్ ట్రస్టు సేవా కార్యక్రమాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ ఎస్ ఎస్ ఛారిటబుల్ ట్రస్టు పరిచయ కార్యక్రమం స్థానిక లబ్బిపేట లోని ట్రస్టు కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, డాక్టర్ జితేంద్ర, బీజేపీ స్టేట్ నాయకులు పల్లపురాజు, ట్రస్ట్ ఛైర్మన్ ఇమ్మడిశెట్టి సుమతీ పాల్గొన్నారు. ట్రస్టు ఛైర్మన్ ఇమ్మడిశెట్టి సుమతీ మాట్లాడుతూ మానవసేవయే మాథవసేవ అంటూ ఈ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా సమాజంలో పేదలకు వారి అభివృద్ధికి ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించదలచామని …

Read More »

ఆర్థరైటిస్‌పై అవగాహన అవసరం

-నిర్లక్ష్యం వహిస్తే సమస్య తీవ్రం -త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు -ప్రముఖ రుమటాలజిస్టు డాక్టర్ డి. నీహారిక -వరల్డ్ ఆర్థరైటిస్‌ డే సందర్భంగా అను హాస్పిటల్లో అవగాహన సదస్సు -ఐదు రోజులు పాటు ఉచిత వైద్య శిబిరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఆర్థరైటిస్‌ అంటే కీళ్లవాతం అని అర్థం. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్‌లాంటి జబ్బుల కంటే ఆర్థరైటిస్‌ సమస్య తీవ్రతే చాలామందిలో ఉంటుంది. కానీ దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే …

Read More »

చేనేత కార్మికుల బకాయిల విడుదల పట్ల నేతన్నల హర్షం

-సజ్జల, చిల్లపల్లి, ఎంఎం నాయక్ లకు కృతజ్ణతలు తెలిపిన ప్రతినిధులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న చేనేత బకాయిల విడుదల పట్ల చేనేత సహకార సంఘాల బాధ్యులు సంతోషం వ్యక్తం చేసారు. పూర్వపు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుండి బుధవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంకు వచ్చిన నేతన్నలు సంస్ధ ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు, చేనేత, జౌళి శాఖ కమీషనర్, ఆప్కో ఎండి ఎంఎం నాయక్ కలిసి తమ అభినందనలు తెలిపారు. గత …

Read More »

మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు నిరాహార దీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్, న్యూ ఢిల్లీ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ ఇచ్చిన పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యములో బుధవారం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం ముందు మరియు గూడూరు నుండి అనకాపల్లి వరకు అన్ని బ్రాంచ్ కేంద్రాల లో మజ్దూర్ యూనియన్ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. రైల్వే కార్మికులను నూతన పెన్షన్ విధానం నుండి మినహాయించి పాత …

Read More »

పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమర్పించారు. విజయనగరం పైడితల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున నుంచి డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు(మంగళవారం) పైడితల్లి సిరిమానోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు మంత్రి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర కి పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మవారిని కోరాను అని అన్నారు.వికేంద్రీకరణ జరగాలని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది. హైదరాబాద్‌లా ఒకే …

Read More »

పదవ బెటాలియన్ ఎన్.డి.ఆర్.ఎఫ్ లో యోగా మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీలు

-బుధవారం నాడు విజేతలకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ప్రదానం.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో బెటాలియన్ జాతీయ విపత్తుల స్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సౌత్ మరియు సౌత్ సెంట్రల్ జోన్ యోగా మరియు వన్ మినిట్ డ్రిల్ పోటీల కార్యక్రమాన్ని పదో బెటాలియన్ కమాండెంట్ జాహీద్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం, కొండపావులూరు గ్రామంలోగల నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన ఎన్.డి.ఆర్.ఎఫ్. ఒడిస్సా, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందిన …

Read More »

రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకుల తోడ్పాటు అభినందనీయం

-వ్యవసాయ పంటరుణాలు,కౌలు రైతులకు మరిన్ని రుణాలందించాలి -ఆక్వా రంగంలో పెద్దఎత్తున తోడ్పాటును అందించాలి -సూక్ష్మ,చిన్న,మధ్యతరహా ఎంటర్పెన్యూర్ రంగాలను మరింత ప్రోత్సహించాలి -స్వయం సహాయక సంఘాలకు మరింత సహకారాన్ని అందించాలి -టిడ్కో,ఇతర గృహనిర్మాణ పధకాలకు బ్యాంకులు సకాలంలో రుణాలివ్వాలి -ఎస్ఎల్బిసి సమావేశంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో వివిధ బ్యాంకులు అందిస్తున్నతోడ్పాటు అభినందనీయమైనదని రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు.అమరావతి సచివాలయం ఐదవ బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో …

Read More »

హాస్టళ్లకు వెళ్లండి..సమస్యలు పరిష్కరించండి

-మీ నిర్లక్ష్యంతో పిల్లలు ఇబ్బందిపడితే సహించేది లేదు -డీడీల సమీక్షా సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల వ్యాప్తంగా ఉండే ఎస్సీ హాస్టళ్లలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి డిప్యుటీ డైరెక్టర్లు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించాలని, వాటిలోని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. తాను కూడా త్వరలోనే హాస్టళ్లను సందర్శించి అక్కడి పరిస్థితులు పరిశీలిస్తామని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వస్తే …

Read More »