-శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: అలంకార సెంటర్ నుండి డీ మార్ట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, విజయవాడ నగరపాలక సంస్థ, 2022 అక్టోబర్ 2 నుండి “మిషన్ క్లీన్ కృష్ణా మరియు గోదావరి” కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజా …
Read More »Latest News
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ కేశినేని శ్రీనివాస్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూలా నక్షత్రం రోజున విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని) కుటుంబ సమేతంగా దర్శించుకుని సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు.
Read More »ఏడవ రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. మూలా నక్షత్రం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రం. మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూల నక్షత్రంరోజున వాగ్దేవతామూర్తి అయినా సరస్వతీ అవతారం అలంకరించబడుతుంది. సరస్వతిదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహంవలన సర్వ విద్యలయందు విజయం పొందుతారు. మూలానక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి …
Read More »చేనేత వస్త్రాలు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలు
-నేత వస్త్రాలను దరించి మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం.. -జిల్లా కలెక్టర్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: చేనేత వస్త్రాలు మన సంస్కృతికి చిహ్నాలని వాటిని ధరించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కాప్ట్స్ కౌన్సిల్ ఆప్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని పివిపి మాల్ నందు ఏర్పాటు చేసిన హాండ్లూమ్ బజార్‌ను శనివారం డిల్లీరావు ప్రారంభించారు. ప్రదర్శనను తిలకించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ …
Read More »శారద విద్యా సంస్థల ప్రెషర్స్ డే సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మొగల్రాజపురంలో ఉన్న శారద విద్యా సంస్థల ” ప్రెషర్స్ డే ” సెలబ్రేషన్స్ శనివారం నగరంలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిధులుగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత డాక్టర్ ఎ.జి.కె గోఖలే (కార్డియాక్ సర్జన్ ), పి.హెచ్.డి రామకృష్ణ (డి.ఐ.జి) విచ్చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కళాశాల చైర్మన్, డాక్టర్ వై రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాల విద్యార్థులకు విశిష్ట వ్యక్తులను పరిచయం చేసి అమూల్యమైన సందేశాలతో …
Read More »మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది దుర్గగుడి కి చేరుకుని ట్రయల్ రన్ నిర్వహించారు. భద్రతా చర్యలపై పోలీసులకు అధికారులతో చర్చించి …
Read More »స్వచ్చ సర్వేక్షణ్ – 2022లో జిఎంసికి ఉత్తమ ర్యాంక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: న్యూడిల్లీలోని స్వచ్చ భారత్ మిషన్ ఆజాదీ @75 స్వచ్చ సర్వేక్షణ్-2022 ర్యాంకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారని, అందులో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 108వ ర్యాంకు సాధించిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూజాతీయ స్థాయిలో స్వచ సర్వేక్షణ్ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం 2016 నుండి పారిశుధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్ధాల తడి పొడి విభజన, …
Read More »బాలయోగి కి జయంతి నివాళులు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయం నందు కోన సీమ ముద్దు బిడ్డ, మాజీ లోక్ సభ స్పీకర్ , దళిత తేజం స్వర్గీయ జి ఎమ్ వి సి బాలయోగి కి దళిత నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసిపోగు రాజేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శిరంసెట్టి నాగేంద్ర, ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి నీలం వెంకట నారాయణ, యర్రా రామారావు, కత్తి డేవిడ్, కోటి రామ్మూర్తి , …
Read More »జాతీయ స్థాయిలో క్లీన్ స్టేట్ క్యాపిటల్ క్యాటగిరిలో ( 5 వ ర్యాంక్) కైవసం
-స్టేట్ క్యాపిటల్ క్యాటగిరిలో (1 వ ర్యాంక్) కైవసం -ఢిల్లీ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదగా అవార్డు స్వీకరించిన -మున్సిపల్ శాఖా మంత్రి అదిమూలపు సురేష్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: భారతదేశం గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అద్వర్యంలో న్యూఢిల్లీలోని తల్కటోర స్టేడియం 2022 అక్టోబర్ 1 న (శనివారం) నిర్వహించిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 …
Read More »ఆ పాత మధురం…అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక ఆంధ్ర లూథ రన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్న నాటి విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది పాల్గొన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించి తమ ఉన్నత స్థికి కారకులైన గురువులను ఘనం గా సత్కరించారు. ఆ నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. గ్రూప్ …
Read More »