Breaking News

ఆ పాత మధురం…అపూర్వం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక ఆంధ్ర లూథ రన్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో 30 సంవత్సరాల క్రితం కలసి చదువుకున్న నాటి విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 60 మంది పాల్గొన్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించి తమ ఉన్నత స్థికి కారకులైన గురువులను ఘనం గా సత్కరించారు. ఆ నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనాటి చిలిపి గుర్తులు తలచుకున్నారు. సత్కారాన్ని అందుకున్న గురువులు మాట్లాడుతూ తమ విద్యార్థులు నేడు వివిధ ప్రభుత్వ శాఖలలో అధికారులుగా, వ్యాపారవేత్తలుగా, అధ్యాపకులుగా ఎదగడం తమను గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గురువులు డాక్టర్ టి. జె. రాజేంద్రప్రసాద్, గురునాధం, ఎం. క్రిస్ట్ఆచారి, ప్రశాంత్ కుమార్, మేరీ మార్గరేట్ లకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని తాతపూడి మార్టీన్ సుధాకర్, జీవన్ కిరణ్, పాల్ జయచంద్ర, తమనం రాకేష్, మేరీమాత తదితరులు పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *