-రూ. 58.93 లక్షల విలువైన నాడు-నేడు పనులకు ఎమ్మెల్యే చేతులమీదుగా భూమిపూజ విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యాలయాలు పున:వైభవం సంతరించుకుంటున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పాయకాపురం రాధానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రూ. 58.93 లక్షల విలువైన నాడు-నేడు పనులకు శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనప్పుడు ఈ ప్రాంతంలో జూనియన్ కళాశాల అవసరమని …
Read More »Latest News
డయాబెటిస్ వైద్యులు వీజీఆర్‌కి మహారాష్ట్ర గవర్నర్ సత్కారం…
-వ్యాధి నియంత్రణకు చేస్తున్న కృషి అపూర్వమని ప్రశంస విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : రోజురోజుకు పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నియంత్రణకు ప్రముఖ డయాబెటిస్ వైద్య నిపుణులు కె.వేణుగోపాల రెడ్డి(వీజీఆర్) చేస్తున్న సేవలను మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి ప్రశంసించారు. మొగల్రాజపురంలోని డాక్టర్ వీజీఆర్ డయాబెటిస్ స్పెషాలిటీస్ హాస్పటల్ అధినేత డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి శనివారం మహారాష్ట్ర గవర్నర్‌ను ముంబయ్‌లోని రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవగాహన, వైద్య శిబిరాల ద్వారా …
Read More »నిమ్మరాజు చలపతిరావుకి ఆత్మీయ సత్కారం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశం లో తనకు చేసిన సత్కారానికి ప్రతిగా సీనియర్ జర్నలిస్టు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ను ఎంతో అభిమానము తో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సత్కరించారు.
Read More »వైయస్ కుటుంబంపై రాజకీయ విమర్శలు చేస్తే ఖబర్దార్… : బోరుగడ్డ అనిల్ కుమార్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ కుటుంబంపై రాజకీయ విమర్శలు చేస్తే ఖబర్దార్ అంటూ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు లిక్కర్ మాఫియాలో వైఎస్ భారతి రెడ్డి ఉన్నట్లు పలు ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. శుక్రవారం గుంటూరులోని వల్లూరి వారి తోట ఆయన కార్యాలయం వద్ద వైయస్ భారతి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం నారా …
Read More »పాస్పోర్ట్ మరియు పిసిసి పొందుట పై అవగాహన కార్యక్రమం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ఇవాళ (09.0922) మధ్యాహ్నం 12 గంటల నుండి పాస్పోర్ట్ మరియు పోలిస్ క్లియరెన్స్ సర్టిఫికేట్(PCC) పొందుటలో ఉన్న సందేహాలు మరియు సలహాలకు సంబంధించి విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి డి.ఎస్.ఎస్. శ్రీనివాస రావు తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. జూమ్ మీటింగ్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న మరియు విదేశాల్లో ఉన్న వారు వారికున్న సందేహాలను నేరుగా పాస్పోర్ట్ అధికారితో మాట్లాడి …
Read More »జాతీయ రహదార్ల విస్తరణ ప్రాజెక్టుల పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో జాతీయ రహదార్ల విస్తరణ ప్రాజెక్టుల పనులకు భూ సేకరణను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ రెవన్యూ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్ 16 జాతీయ రహదారిలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు అవసరమైన భూ సేకరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డిఆర్‌వో కె. మోహన్ కుమార్, తహాశీల్థార్లు, భూ సేకరణ అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో విస్తరించనున్న జాతీయ రహదార్లలోని …
Read More »నగరంలో ‘రోన్ఫెన్’ బ్రాండ్ అంబాసిడర్స్ మీట్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సరైన సమయంలో ప్రత్తి, మిరప పంటలను ఆశించు రసం పీల్చే పురుగులను నివారించినట్లయితే అధిక దిగుబడులు సాధించ వచ్చని బెస్ట్ అగ్రి లైఫ్ లిమిటెడ్ నేషనల్ మార్కెటింగ్ మేనేజర్ యస్.నరసయ్య అభిప్రాయ పడ్డారు. శుక్రవారం స్థానిక అరండల్‌పేట, హోటల్ కార్తికేయనందు ‘రోన్ఫెన్’ బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భముగా గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, మేడికొండూరు మండలాల నుండి సుమారు 100 మంది రైతులు పాల్గొని ‘రోన్ఫెన్’ ఉత్పాదన పనితనాన్ని తోటి రైతులకు వివరించారు. …
Read More »‘ పీఎం టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృశ్య శ్రవణ విధానంలో శుక్రవారం ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి పాల్గొన్నారు. 2025 నాటికి దేశం నుండి క్షయవ్యాధి నిర్మూలన ధ్యేయంగా ‘ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్’ మిషన్ పనిచేయనుండగా, ఇది రోగి-కేంద్రీకృత ఆరోగ్య వ్యవస్థకు సమాజ మద్దతును అందించే దిశగా తొలి అడుగు కానుంది. టిబిని నిర్మూలించాలనే …
Read More »జగనన్న లేఅవుట్లలో పూడికకు పోలవరం ప్రాజెక్టు మట్టిని తరలించేందుకు చర్యలు…
-ఉన్నతస్థాయి నుండి అనుమతులకు ప్రయత్నిస్తాం… -జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : జిల్లాలో జరుగుతున్న జగనన్న లేఅవుట్లలోని గృహా నిర్మాణ పనులలో పూడికకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుండి మట్టిని తరలించే ఆలోచన చేస్తున్నామని, లేఅవుట్ల దగ్గర ప్రాంతాలలోని కొండ ప్రాంతాల నుండి కూడా మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మైనింగ్, హౌసింగ్, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో మట్టిని తరలించే ప్రక్రియపై …
Read More »ఇష్టపడిన దానికోసం కష్టపడండి
-భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు -నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య -మూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనదే : విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు ఇష్టపడిన దానికోసం కష్టపడితే నష్టపడేది లేదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘‘ డెవలప్‌మెంట్ ఆఫ్ లీడర్‌షిప్ క్వాలిటీస్’’ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాస …
Read More »