-ఏపీ మోడల్ స్కూల్స్ లో ఇంధన సామర్ధ్య చర్యలు -కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ బీఈఈ ప్రవేశ పెట్టిన స్పీడ్ పధకం పేరుతో ఇంధన సామర్ధ్య ఉపకరణాలు -7 జిల్లాలో 85 మోడల్ స్కూల్స్, వసతి గృహాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసిన ఏపీ ఎస్ఈసిఎం. -51 పాఠశాలల్లో 3.79 లక్షల యూనిట్లు ఆదా.. ఫలితంగా రూ 23 లక్షలు ఆదా -బీఈఈ సౌజన్యంతో దశలవారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలనీ ఏపీఎస్ఈసిఎం లక్ష్యం -విద్యార్ధులకు అవగాహన కల్పించండం ధ్యేయం విజయవాడ, నేటి పత్రిక …
Read More »Latest News
ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) ఆర్జీల సమస్యల పై ఆర్జీదారులు, సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ను ద్వారా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపుతున్నామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధించిన ఆర్జీదారులు, అధికారులతో కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని దీనిలో భాగంగా పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన …
Read More »సెంట్రల్ నియోజకవర్గంలో 25,144 మందికి అమ్మఒడి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు చదువు భారం కాకూడదనే మహోన్నత ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మూడో విడత అమ్మఒడి పథకం ద్వారా 25,144 మంది తల్లుల ఖాతాలలో సోమవారం రూ. 37.71 కోట్ల నగదు జమ కానున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2019–20లో ఈ పథకం ద్వారా 22,095 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.33.14 కోట్ల నగదు జమ …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా షటిల్ టోర్నీ విజేతలకు బహుమతుల ప్రదానం…
-క్రీడలతో మానసిక ఉల్లాసం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవ పున్నయ్య ఇండోర్ స్టేడియం నందు మల్లాది వేంకట సుబ్బారావు స్మారకార్థం నిర్వహించిన నగర స్థాయి షటిల్ టోర్నీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, వీఎంసీ స్పోర్ట్స్ & ట్రాఫిక్ కమిటీ చైర్మన్ పెనుమత్స శిరీష సత్యంలతో కలిసి జ్యోతి …
Read More »యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి…
-మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే మత్తు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎం. జి. రోడ్డులోని పీవీపీ మాల్ నందు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అన్నింటికంటే భయంకరమైన వ్యాధి అని అన్నారు. ఈ …
Read More »పశ్చిమంలో జనసేన గ్రాఫ్ పెరిగి వైసిపి గ్రాఫ్ పడిపోయింది… : పోతిన వెంకట మహేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 52 వ డివిజన్ ప్రెసిడెంట్ నల్లబిల్లి కనకారావు అద్వ ర్యం లో డివిజన్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డివిజన్ లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్ల పంపిణీ కార్యక్రమం కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కళ్యాణ మండపము నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు …
Read More »అన్ని కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
-నేటి (ఈ నెల 27వ తేదీ) నుంచి జూలై 12 వరకూ ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరణ. – సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత …
Read More »నగరంలో ‘పక్కా కమర్షియల్’ చిత్ర యూనిట్ సందడి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ‘పక్కా కమర్షియల్’ చిత్ర యూనిట్ సందడి చేసింది. జూలై ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా యూనిట్ సభ్యులు నగరంలోని రాజ్-యువరాజ్ (జీ3) థియేటర్లకు విచ్చేశారు. ఈ సందర్భంగా యూనిట్ మీడియా శనివారం సమావేశం నిర్వహించింది. హీరో గోపీచంద్ మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చిందని ఖచ్చితంగా సినీ అభిమానులను అలరించేలా వినోదాత్మకంగా పక్కా కమర్షియల్ సినిమా వుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో రూపొందించామని …
Read More »రైతుబజార్లలలో నిర్థేశించిన ధరలకు నాణ్యమైన కూరగాయలను విక్రయించాలి…
-స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రైతుబజార్లను మరింత పటిష్టపరచి ప్రభుత్వం నిర్థేశించిన ధరలకే వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలను విక్రయించేలా చర్యలు తీసుకుంటామని స్వరాజ్ మైదాన్ రైతుబజారుకు ప్రత్యామ్నాయంగా నగరంలో మరో నాలుగు రైతుబజార్లను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న రైతుబజారును శనివారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మైలవరం తిరువూరు …
Read More »కరోనా వైరస్ కంటే భయంకరం డ్రగ్స్ వినియోగం…
-ప్రతి విద్యార్థి ఒక పోలీస్‌లా డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేయాలి… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డ్రగ్స్ వినియోగం కరోనా వైరస్ కంటే అతి భయంకరమైనదని ప్రతి విద్యార్థి డ్రగ్స్ వినియోగం పై అవగాహన పెంచుకుని అరికట్టేందుకు ఒక పోలీస్ మాదిరిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక మెగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో శనివారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేక …
Read More »