విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం 28 వ డివిజన్ BRTS రోడ్డు, భానునగర్ లో పలు విదులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డివిజన్ పరిధిలోని భానునగర్ లో ఒక వారం పాటు వాటర్ టెస్ట్ చేయాలి అన్నారు. వాటర్ పైప్ లైన్స్ డ్రైన్స్ లోపల నుండి వచ్చేవి గుర్తించి వెంటనే పైప్ లైన్స్ మార్చాలి అన్నారు. …
Read More »Latest News
స్పందనలో ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరణ
-ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం చూపాలి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులకు సూచించారు. నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమము వివిధ సమస్యలపై 30 మంది అర్జిదారులు వారి వారి ఇబ్బందులను నేరుగా కమిషనర్ కి …
Read More »శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులు ప్రారంభం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద శ్రీ చక్రాలయంలో శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులను శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరిస్వామి ప్రారంభించారు. సోమవారం ఉదయం శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రధానంగా అర్చకులకు వారానికి రెండు రోజులపాటు అనగా బుధ, శుక్ర వారాలలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం …
Read More »ఆంధ్రప్రదేశ్ బట్రాజుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పాలగిరి చంద్రకళ ఏకగ్రీవం
-“భట్రాజు పొగడ్తలు” అనే పదాన్ని నిషేధించాలని సీఎంకు వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బట్రాజు కుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. విజయవాడ గొల్లపూడి లోని రాష్ట్ర బీసీ సంక్షేమ భవన్ లో ఆదివారం నిర్వహించిన ఈ సమావేశంలో “భట్రాజుల ఆత్మగౌరవ ప్రతీక” అని రాష్ట్ర భట్రాజు కుల సభ్యులు ప్రేమగా పిలుచుకునే అన్నమయ్య జిల్లాకు చెందిన “పాలగిరి. చంద్రకళ” ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్రాజు కుల సంఘం మహిళా అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »థామస్ కప్ గెలిచిన భారత జట్టును అభినందించిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో తొలిసారి చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలతో కూడిన భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసించారు. తుది పోరులో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా థామస్ కప్‌ను గెలుచుకోవడం భారత జట్టు గొప్ప విజయమని గవర్నర్ అన్నారు. తమ …
Read More »అన్నదాతలకు.. మీటర్లతో మేలే..!
-వ్యవసాయ పంపుసెట్లకు మెరుగైన విద్యుత్తు -మీటర్ల బిగింపుతో పారదర్శకత, జవాబుదారీతనం -నాణ్యమైన కరెంటు కోసం డిస్కంలను నిలదీయొచ్చు -సిక్కోలులో పైలట్ ప్రాజెక్టు విజయవంతం -నేరుగా నగదు బదిలీ పథకంతో 33.75 మిలియన్ యూనిట్లు ఆదా -ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి -వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లతో విద్యుత్తు మౌలిక సదుపాయాల సామర్థ్యం తెలుస్తుంది -నాణ్యమైన కరెంటు అందించేందుకు దోహదపడుతుంది -డీబీటీ పథకం కింద మీటర్లు బిగిస్తాం -ఈ పథకంతో రైతులు సాధికారత సాధిస్తారు -మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్తు …
Read More »ఘనంగా సౌత్ ఆఫ్రికా మహానాడు వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుపుకుంటున్న సందర్భంలో అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సందర్భంగా సౌత్ ఆఫ్రికాదేశంలో టిడిపి ఎన్‌ఆర్‌ఐ శాఖ ఘనంగా మహానాడు వేడుకలు 14 మేన జోహన్స్‌బర్గ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ప్రత్యేకంగా మాజీ మంత్రి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ జవహర్ మరియు తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ గౌతు శిరీష హాజరయ్యారు. సౌత్ ఆఫ్రికాలో ఉన్న వివిధ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. …
Read More »గుంటూరు శ్రీ చక్రాలయంలో శ్రీ చక్ర వేదాద్యయన శిక్షణా తరగతులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో తొలిసారిగా గుంటూరు, నల్లపాడు రోడ్ సాయినగర్‌లో 23కోట్ల శ్రీవిద్యాబీజాక్షరములు నిక్షిప్తం చేయబడి, 20 అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూపంపై 2 అడుగుల శ్రీచక్రం ప్రతిష్ఠించబడిన శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరీ చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో సోమవారం ఉదయం శ్రీచక్ర వేదాద్యయన శిక్షణాతరగతులకు శ్రీకారం చుట్టబడుతున్నది. ప్రధానంగా అర్చకులకు వారానికి 2రోజులు బుధ, శుక్రవారాలలో ఈ తరగతులు నిర్వహించబడతాయి. కారంచేడులోని శ్రీ వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ ప్రణవానంద గిరిస్వామి …
Read More »జిల్లావ్యాప్తంగా 1,40,165 మంది రైతు కుంటుంబాలకు రూ.77.09 కోట్లు మంజూరు
-వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం కార్యక్రమం పెడన లో -వరుసగా నాలుగో ఏడాది 2022-23 సం.లో రైతులకు మొదటి విడత ఆర్ధిక సహాయం -16న ఉదయం 11.00 గంటలకు పెడనలోని AMC లో జిల్లాస్థాయి ప్రారంభ కార్యక్రమం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 16న వైఎస్ఆర్ రైతు భరోసా – పి.ఎమ్.కిసాస్ పథకం క్రింద వరుసగా నాలుగో ఏడాది కూడా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. …
Read More »సోమవారం జిల్లాలో 4వ విడత రైతు భరోసా
-121955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు జమ -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ రైతు భరోసా నాలుగో విడత మొదటి దఫా గా జిల్లాలో 1,21,955 మంది రైతులకు రూ.6707.525 లక్షలు మేర ప్రయోజనం రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి లో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం లో …
Read More »