Breaking News

స్పందనలో ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరణ

-ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు పరిష్కారం చూపాలి
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలలో ఎదురౌతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులకు సూచించారు. న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నిర్వహించిన స్పందన కార్యక్రమము వివిధ సమస్యలపై 30 మంది అర్జిదారులు వారి వారి ఇబ్బందులను నేరుగా కమిషనర్ కి వివరించారు. ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ప్రజలకు ఎదురౌతున్న సమస్యలపై స్పందించి అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అన్నారు. స్పందనలో అదనపు కమిషనర్ (జనరల్) – 1, పబ్లిక్ హెల్త్ విభాగం – 10, ఇంజనీరింగ్ విభాగం – 4, పట్టణ ప్రణాళిక విభాగం – 6, రెవెన్యూ – 4, ఎడ్యుకేషన్ విభాగం – 1, స్పెషల్ సెల్ -1, యు.సి.డి విభాగం – 3 మొత్తం 30 అర్జీలు స్వీక‌రించుట జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్)  యం.శామల, చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.బాబు శ్రీనివాసరావు, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 7 అర్జీలు
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 2 కార్యాలయంలో 4 అర్జీలు పబ్లిక్ హెల్త్ విభాగం – 2, ఇంజనీరింగ్ విభాగం –1, రెవెన్యూ – 1, సర్కిల్ – 3 కార్యాలయంలో 3 అర్జీలు పట్టణ ప్రణాళిక విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం –2 మరియు సర్కిల్ – 1 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *