Breaking News

శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులు ప్రారంభం


గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద శ్రీ చక్రాలయంలో శ్రీ చక్ర వేదాధ్యయన శిక్షణా తరగతులను శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరిస్వామి ప్రారంభించారు. సోమవారం ఉదయం శ్రీ మహాగణపతి శ్రీ కుమార స్వామి సహిత శ్రీ చౌడేశ్వరి చంద్రశేఖర సమన్విత శ్రీ చక్రాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రధానంగా అర్చకులకు వారానికి రెండు రోజులపాటు అనగా బుధ, శుక్ర వారాలలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందించదగిన విషయమన్నారు. కారంచేడులోని శ్రీ వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి ప్రణావానంద గిరిస్వామి నేతృత్వంలో ఉత్తర ఆశ్రమ పీఠాధిపతి, గుంటూరు శ్రీ చక్రాలయ సర్వాధికార ప్రతినిధి శ్రీశ్రీశ్రీ విశ్వంభరానంద గిరి స్వామి వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుడం ఎంతో ముదావాహమన్నారు. ఈ కార్యక్రమంలో తర్కశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ ప్రాచార్య శ్రిష్టి లక్ష్మీ కుమార్ శర్మ, బోధకులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ అవ్వారు వెంకటేశ్వర్లు , ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మన నరసింహారావు, మాజీ కార్పొరేటర్ అడకా శ్రీనివాసరావు, భాషా పండితులు కంభంపాటి రాధాకృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *