Breaking News

వాటర్ పైప్ లైన్స్ డ్రైన్స్ లోపల నుండి వచ్చేవి గుర్తించి వెంటనే పైప్ లైన్స్ మార్చాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం 28 వ డివిజన్ BRTS రోడ్డు, భానునగర్ లో పలు విదులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డివిజన్ పరిధిలోని భానునగర్ లో ఒక వారం పాటు వాటర్ టెస్ట్ చేయాలి అన్నారు. వాటర్ పైప్ లైన్స్ డ్రైన్స్ లోపల నుండి వచ్చేవి గుర్తించి వెంటనే పైప్ లైన్స్ మార్చాలి అన్నారు. సిటీ లో ఇల్లా వాటర్ పైప్ లైన్స్ సైడ్ డ్రైన్స్ నుండి వెళ్ళేవి వారం లోపు గుర్తించి లిస్టు సబ్మిట్ చేయాలి అని సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగినది.
డివిజన్ ప్రజలు ఎదుర్కోను సమస్యలను సత్వరమే పరిశీలించుటకు తగిన చర్యలు తీసుకుంటామని, పాడైన డ్రెయిన్లకు కూడా తగిన మరమ్మత్తులు నిర్వహించుట జరుగుతుందని అన్నారు. చాలా ఏరియాలో 7 గంటలు దాటినా కుడా మెయిన్ రోడ్స్ స్వీపింగ్ కంప్లీట్ చేయలేదు. డోర్ టు డోర్ చెత్తను కలెక్షన్ కుడా మొదలు పెట్టలేదు. 7 గంటలు కల్ల మెయిన్ రోడ్స్ కంప్లీట్ చేసి, చెత్తను కలెక్షన్ ను మొదలుపెట్టాలి అని సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగినది.
ఇంటింటి చెత్త సేకరణ తీరును పరిశీలించిన సందర్భంలో రోడ్ల మిద అక్కడక్కడ చెత్త కుప్పలు ఉండుట గమనించి, ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నపటికి చెత్తను పడవేయట పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, స్థానికులు ఎవరు రోడ్ల పై చెత్త పడవేయకుండా కేవలం చెత్త సేకరణ కొరకు వచ్చు పారిశుధ్య కార్మికులకు మాత్రమే అందించేలా ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. సదరు ప్రాంతములో ఎన్ని నివాసాలు ఉన్నవి, ఎంత మందికి చెత్త బుట్టలు అందించినది మొదలగు వివరాలతో పాటుగా చెత్త సేకరణ సమయంలో ఎంత మంది నివాసాల వారు సిబ్బందికి చెత్తను అందిస్తున్నది వంటి వివరాలు అధికారులను అడిగితెలుసుకోన్నారు.
4 వ డివిజన్ పరిధిలోని హరిజన వాడ రోడ్డు నందు వున్న పైప్ లైన్ వర్క్ మెటీరియల్, డెబ్రిస్ తొలగించలని అన్నారు. ఇన్నోటేల్ బ్యాక్ సైడ్ టు కండ్రిక జంక్షన్ వరకు కండ్రిక జంక్షన్ నుండి సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ( సెంట్రల్ డివేడర్ ) లో గ్రీనరి డెవలప్ చేయాలి అని సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగినది. నూజివీడు రోడ్ దగ్గర భవాని రెస్టారెంట్ సెంటర్ డివేడర్ మిగిలిపోయిన భాగం షుమారు 150 mets, వెంటనే కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలని, సితార జంక్షన్ డెవలప్ చేయాలనీ, హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా డివేడర్ కొoత భాగం గ్రీనరి చేయకుండా మిగిలిపొయినది దానిని వెంటనే గ్రీనరి వర్క్ స్టార్ట్ చేయాలనీ సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగినది.
పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యమ.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.బాబు శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *