Breaking News

థామస్ కప్ గెలిచిన భారత జట్టును అభినందించిన గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌లో తొలిసారి చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలతో కూడిన భారత జట్టు మెరుగైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసించారు. తుది పోరులో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా థామస్‌ కప్‌ను గెలుచుకోవడం భారత జట్టు గొప్ప విజయమని గవర్నర్ అన్నారు. తమ అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేసిన భారత జట్టు సభ్యులు అందరూ ప్రశంసలకు అర్హులని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *