అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRT సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లతో 01.05.22 రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వర్చువల్ సమావేశం నిర్వహించింది. APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రులకు అందిస్తున్న వివిధ ఉచిత సేవలను మేడపాటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలుగు అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు చాలా ఉపయోగకరమైనవి, విలువైనవి అని కొనియాడారు. విద్యార్థులు, …
Read More »Latest News
ఉపాధిహామీ పధకంలో 1900 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు
-యుద్ధ ప్రాతిపదికన ఉపాధిహామీ పనులు చేపట్టడం జరుగుతుంది -పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకు 1072 కోట్ల రూ.లకు పరిపాలనామోదం -పియంజెఎస్ వై చేసిన పనులకు 83 కోట్ల రూ.లు మంజూరుకు చర్యలు -ఆర్డబ్ల్యుఎస్ లో చేసిన పనులకు 800 కోట్ల రూ.లు పెండింగ్ బిల్లులు మంజూరు -నీటిఎద్దడి గల గ్రామాల్లో ట్యాంకర్లు ద్వారా మంచినీటి సరఫరా -బిల్లులు రావని కాంట్రాక్టర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -ఇకపై క్లాప్ మిత్రలుగా స్వచ్ఛ సంకల్పంలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లు -రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి …
Read More »ఆక్వా రైతులకు మరో సువర్ణ అవకాశం
-ఎండార్స్మెంట్ కోసం 31.5.2022 వరకు అవకాశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతు సోదరుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo ఎండార్స్మెంట్ చేసుకొనుటకు మరో అవకాశం కల్పించిందని మత్స్య సహాయ సంచాలకులు, కొవ్వూరు బి. సైదా సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆక్వా రైతులు, ఆక్వా భూమి కలిగిన రైతులందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ వారు తెలియజేయునది ఏమనగా నూతనంగా తీసుకు తీసుకువచ్చిన ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2020 (APSADA) ప్రకారం మీ …
Read More »మ్యాథ్ మెటిక్స్ పరీక్షకు 23,466 మంది 99.18 శాతం హాజరు..
-పరీక్షలు అనంతరం అత్యంత జాగ్రతగా జాబు పత్రాలు తరలింపు -కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 3వ రోజు లెక్కలు పరీక్షకి 23,992 మంది హాజరు కావాలసి ఉండగా, 23,466 (97.81 %) మంది హాజరైనట్లు 526 మంది హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ధవళేశ్వరం లోని బాలికొన్నత పాటశాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, జవాబు పత్రాల ప్యాకింగ్, తరలింపు ప్రక్రియను జిల్లా …
Read More »ముస్లిమ్ సోదర సోదరి మణులులకు రంజాన్ శుభాకాంక్షలు
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిమ్ సోదరులు అంత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో ముస్లిమ్ సోదరులు పరమ నిష్టతో చేసే ఉపవాసం ఎంతో గొప్పదని ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే ఈ పండుగ సందర్భంగా పాటించే నియమాలు అందరికీ ఆదర్శపాయమని ముఖ్యంగా ఈ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు యోగయోగాలుగా సమాజాన్ని తీర్చిదిద్దుతున్నాయని ఇటువంటి పవిత్రమైన రజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనంద ఉత్సహాల మధ్య జరుపుకోవాలని జిల్లా …
Read More »ప్రశాంత వాతావారణంలో పకడ్భందీగా జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ప్రశాంత వాతావారణంలో సజావుగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని మొగల్రాజపురం బోయపాటి శివరామకృష్ణ మున్పిపల్ హైస్కూల్ నందు నిర్వహిస్తున్న 10 తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల 27వ తేదీ నుండి జిల్లాలో నిర్వహిస్తున్న 10 తరగతి పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సజావుగా …
Read More »స్పందనలో 50 ఆర్జీల నమోదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారించడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఆర్జీదారునకు పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలను క్షుణంగా పరిశీలించి పరిష్కారం కాని వాటికి …
Read More »సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లాలో సుస్థిరాభివృద్ధి ప్రగతిని సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ డిల్లీరావు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీతి అయోగ్ నివేదిక ప్రకారం సుస్థిరాభివృద్ధిలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో తీసుకువచ్చేందుకు జిల్లాలోని ప్రతీ సూచిక దోహదం చేయాలన్నారు. నవరత్నాలు ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »ఈనెల రేషన్ సరుకుల పంపిణీ నూరు శాతం లబ్దిదారులకు అందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్డుదారులకు ఈనెల రేషన్ సరుకుల పంపిణీ నూరు శాతం లబ్దిదారులకు అందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నేటి నుండి ప్రారంభించిన రేషన్‌పంపిణీ త్వరితగతిన కార్డు దారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఎన్‌టిఆర్ జిల్లాలో ఉన్న 958 రేషన్ దుకాణాలకు ఎఫ్‌సిఐ గోడౌన్ నుండి రవాణా చేయడం జరిగిందని ఆమె అన్నారు. జిల్లాలోని 5,86,301 బియ్యం కార్డుదారులకు 374 మొబైల్ …
Read More »లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో అనుసంధానంలో ఎదురవుతున్న ఇబ్బందులపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆధార్ కార్డులోని మార్పులు, చేర్పులు, సవరణలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులకు, కార్వె కన్సల్‌టెంట్ ప్రతినిది ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి కావడంతో …
Read More »