Breaking News

స్పందనలో 50 ఆర్జీల నమోదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారించడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఆర్జీదారునకు పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలను క్షుణంగా పరిశీలించి పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను ధరఖాస్తు దారులకు తెలియజేయాలన్నారు. పెండిరగ్‌ ఆర్జీలపై శాఖల వారిగా కలెక్టర్‌ సమీక్షించారు. ఆర్జీలు ఏ స్థాయిలోను పెండిరగ్‌ ఉండరాదన్నారు. బియాండ్‌ ఎస్‌ఎల్‌, రీఓపెనింగ్‌ లేకుండా ఆర్జీదారులు సంతృప్తి చేందేలా ఆర్జీలు పరిష్కారించాలన్నారు. తిరిగి సమర్పిస్తున్న ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ అంశాలపై ధరఖాస్తులు పునరావృతం అవుతున్నాయని వీటిని సూక్ష్మస్థాయిలో అధికారులు పరిశీలించాలన్నారు.
నేటి వరకు ఏపి సేవా పోర్టల్‌లో వివిధ శాఖలకు సంబంధించి 312 వివిధ స్థాయిలో పరిష్కరించవలసిన ఆర్జీలు ఉన్నాయని వీటిని సంబంధిత అధికారులు పరిష్కారించాలన్నారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, పౌర సరఫరాలు, మున్సిపల్‌ ఎడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించినవి ఉన్నాయన్నారు. స్పందనలో 183 ఆర్జీలు పెండిరగ్‌లో ఉన్నాయని వీటిలో ఎక్కువగా 90కి పైగా ఆర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయన్నారు. ఈ ఆర్జీలు సకాలంలో పరిష్కారించాలని, రీఓపెన్‌ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. 24 గంటలు, 48 గంటలలో పరిష్కరించవలసినవి ఏ స్థాయిలోను పెండిరగ్‌ వుండరాదన్నారు. క్రింది స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో సమర్పిస్తారని దీనిని దృష్టిలో పెట్టుకుని క్రింది స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్జీలను స్పందన ద్వారానే కాకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, 1902 కాల్‌ సెంటర్‌, మొబైల్‌ యాప్‌, వెబ్‌ అపిలికేషన్‌ ద్వారా కూడా ప్రజలు సమర్పిస్తారని కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు.

స్పందనలో వచ్చిన ఆర్జీలు…
విజయవాడ నగరం భవానిపురానికి చెందిన జి. బాలసాయిరాజ ఆర్జీ ఇస్తూ ఎన్‌ఓసి సర్టిఫికెట్‌ కొరకు
జి. కొండూరు మండల గ్రామానికి చెందిన బి. గోవర్థన్‌రావు ఆర్జీ ఇస్తూ ఆనదికారకంగా చెరువులోని మట్టిని ఇటుకబట్టీలకు, ఇళ్లకు, పొలాల మెరకకు తరలిస్తున్నారని దీనిపై తగు చర్యల కొరకు.
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి నగర పంచాయతీకి చెందిన బంగారు దుర్గ, వి. లక్ష్మిలు ఆర్జీలు ఇస్తూ సర్వీస్‌లో ఉండగా స్వీపర్‌గా పనిచేస్తూ మరణించిన తమ భర్తలకు రావాల్సిన ప్రభుత్వ సాయం అధించాలని కోరారు.
కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన కర్ల వెంకటేశ్వరరావు ఆర్జీ ఇస్తూ తనకు సంబంధించిన భూమి సర్వే నెంబర్‌లో ఎసైన్డ ల్యాండ్‌ ఉన్నదని ఇందుకు సంబంధించి సరిహద్దులు చూపాలని కోరారు.
గంపలగూడెం మండలం నెమలి గ్రామ పంచాయతీకి చెందిన యం ఉపేంద్ర ఆర్జీ ఇస్తూ తనకు చెందిన 50 సెంట్ల స్థిరాస్తి భూమి ఆక్రమణకు గురి అయిందని , సర్వే చేయించి తన భూమి తనకు ఇప్పించాలని కోరారు.
విజయవాడ నగరం గుణదలకు చెందిన కత్తుల సూరజ్‌ కిరణ్‌ ఆర్జీ ఇస్తూ యంసిఏ కోర్సు చదువుకుంటున్న తనకు 2019`21 సంవత్సరానికి రావాల్సిన ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ ఇప్పించాలని కోరారు.
స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జడ్పి సిఇఓ సూర్య ప్రకాష్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *