-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిమ్ సోదరులు అంత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో ముస్లిమ్ సోదరులు పరమ నిష్టతో చేసే ఉపవాసం ఎంతో గొప్పదని ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే ఈ పండుగ సందర్భంగా పాటించే నియమాలు అందరికీ ఆదర్శపాయమని ముఖ్యంగా ఈ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు యోగయోగాలుగా సమాజాన్ని తీర్చిదిద్దుతున్నాయని ఇటువంటి పవిత్రమైన రజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనంద ఉత్సహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు శుభాకాంక్షలు తెలిజయేశారు. రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఐదు ప్రాథమిక విధులను తప్పనిసరిగా నిర్వర్తిస్తారు. ఇమాన్, నమాజ్ జకాత్, రోజా, హజ్ అనే విధులను పాటించాలి భగవంతుడైన అల్లాప్‌ా పై పూర్తి విశ్వాసం ఉంచడమే ఇమాన్ అల్లా అందరినీ చల్లగా కాపాడాలని ఆశీస్సులు అందించాలని వీరి ప్రార్ధనలో కోరుకోవటం విశేషం స్వర్గం నుంచి భూమికి ఖురాన్ వచ్చిన మాసమిది రంజూన్ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమైంది. రంజాన్ అనేది పండుగ పేరు కాదు ఇస్లామిక్ క్యాలెండర్లోని 9వ నెలను రంజాన్ మాసం అని అంటారు. ఈనెలలోనే ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖరాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని విశ్వాసం మానవత్వానికి అద్దంపట్టే ధర్మసూత్రాలు ఇస్లాంలో ఉన్నాయి. సమాజ్ దగ్గర నుంచి రోజు అవలంబించే పద్దతుల వరకు ఎన్నోమంచి విషయాలను ఇస్లాం నుంచి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇంతటి పవిత్రమైన రంజాన్ పండుగను ముస్లిమ్ సోదర సోదరీ మణులు ఆనందంగా జరుపుకోవాలని అల్లా వారి కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగచేయలని కోరుకుంటూ జిల్లాలోని ముస్లిమ్ సోదద సోదరి మణులకు, వివిధ శాఖలలో పనిచేస్తున్నా అధికారులకు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిజేశారు.
Prajavartha Online Telugu News