Latest News

యాంటీ లార్వా ఆప‌రేష‌న్ డ్రైవ్ ను యుద్ధప్రాతిప‌దిక‌న చేప‌ట్టాలి

-దోమ‌ల నియంత్రణ‌కు తీసుకోవల‌సిన చ‌ర్యల‌పై ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు స‌మీక్ష‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆప‌రేష‌న్ డ్రైవ్ ను వారం రోజుల పాటు యుద్ధప్రాతిప‌దిక‌న నిర్వహించాల‌ని సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాల‌నీలోని జ‌న‌హిత స‌ద‌న‌ములో మ‌లేరియా అధికారులు, శానిటేషన్ సెక్రటరీలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హై రిస్క్ ప్రాంతాలపై ఆరా తీశారు. ఆయా ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని, ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ స్ప్రేయింగ్ యంత్రాలని …

Read More »

ప్రజల సంక్షేమమే మా లక్ష్యం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అభివృద్ధి, సంక్షేమం ధ్యేయం గా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో. పప్పులమిల్లు రోడ్డు, రఘురామ వీధి,పూర్ణచంద్రరావు రోడ్డు ప్రాంతంలో గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాల్గోవ రోజు జరిగిన కార్యక్రమం లో అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ …

Read More »

విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నాం

-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను చూసి ప్రస్తుతం పాత చార్జీలు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మరింత దెబ్బ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు తగదని అన్నారు. చార్జీలు తగ్గించని …

Read More »

31న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలు

-ఏప్రిల్ 7న విశాఖపట్నం లో రాష్ట్రస్థాయి నిరసన -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రజలను దోచుకోవడానికే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. 8 సంవత్సరాల కాలంలో అక్షరాలా రూ. 26లక్షల కోట్లను ప్రజలనుంచి దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెట్రో ఉత్పత్తులపై పన్నులు తక్కువగా ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చాక దోచుకెవడమే పరమావధిగా మారిందని ధ్వజమెత్తారు. …

Read More »

31న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలకు నిరసనగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 31న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిరసనలో పాల్గోంటారన్నారు. మోదీ ప్రభుత్వంలో భారతీయుల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, …

Read More »

ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన సీఎం జగన్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జలవనరుల శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం జగన్ పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తయ్యేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జలవనరులశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. పోలవరం ప్రాజెక్టులో పునరావాసాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. డీబీటీ పద్దతుల్లో ఆర్​అండ్​ఆర్ …

Read More »

నగరంలో ముడు రోజులపాటు పరిణయ ఎగ్జిబిషన్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిణయ ఎగ్జిబిషన్ విజయవాడలో శేషసాయి కళ్యాణ మండపములో మంగళవారం  ప్రారంభించారు. ఈ  ఎగ్జిబిషన్  ముడు రోజులు మార్చి 29, 30, 31 తేదీలు ఉదయం 10 నుండి సాయంత్రం 9 గంటలవరకు అందుబాటులో ఉంటుంది.  ఇక్కడ వివిధ క్వాలిటీలలో ఏక్సక్లూజివ్ కలెక్షన్స్ అన్ని రకాల పట్టుశారీస్, లెహెంగాస్‌, బనారస్ శారీస్, ఫాన్సీ శారీస్, ప్రీమియం పట్టు శారీస్, జార్జెంట్‌, శాటిన్‌, క్రేప్‌, పింటెడ్‌, డ్రెస్సెస్, వివిధ రకాల  ఫ్యాన్సీ జ్యువలరీలు పలురకాలు దొరుకుతాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు, …

Read More »

పెట్రో ఉత్పత్తుల పెరుగుదలపై కాంగ్రెస్ పోరు

-కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధం కావాలి -డప్పులు కొట్టండి..గంటలు మోగించండి -పాలకులకు వినిపించేలా ధరల పెరుగుదలపై నిరసన తెలపండి -31 నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో నిరసనలకు శ్రీకారం -ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల పెరుగుదలపై “మాంగాయ్ ముక్త్ భారత్ అభియాన్” పేరుతో మూడు విడతలుగా ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ , సిఎన్జీ ఉత్పత్తుల పెరుగుదలపై ఈ నెల …

Read More »

ఏపీ ప్రభుత్వంతో ముల్క్‌ హోల్డింగ్స్‌ ఎంవోయూ…

-సీఎం జగన్‌ను కలిసిన ఛైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముల్క్‌ హోల్డింగ్స్‌ ఇంటర్నేషనల్‌ చైర్మన్‌ నవాబ్‌ షహతాజ్‌ షాజీ ఉల్‌ ముల్క్, వైస్‌ ఛైర్మన్‌ నవాబ్‌ అద్నాన్‌ ఉల్‌ ముల్క్ మంగ‌ళ‌వారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో క‌లిశారు. ఏపీలో ముల్క్‌ హోల్డింగ్స్‌ బిజినెస్‌ ప్రణాళికపై సీఎంతో చర్చించారు. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు చేసేందుకు ముల్క్‌ హోల్డింగ్స్‌ ముందుకొచ్చింది. అల్యుమినియం కాయిల్స్‌ తయారీ, కాయిల్‌ కోటింగ్‌కు ఉపయోగించే …

Read More »

కోరమాండల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలకు ప్రతిభా పురస్కారాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ గ్రోమోర్‌ ఎరువుల సంస్థ గ్రామీణ బాలికల విద్యను ప్రోత్సహించే భాగంలో మంగళవారం మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రము ఫంక్షన్‌ హాలు నందు స్కాలర్‌ షిన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిధి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వారు పేద విద్యార్థులకు అందులోను …

Read More »