Latest News

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ జనరేషన్ ప్లాంటును ప్రారంభించామని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు వెల్లడించారు. శనివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ రెడ్డి అసోసియేషన్ చారిటబుల్, యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 22 లక్షల రూపాయలతో నిర్మించిన 87 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్ …

Read More »

దగ్గుబాటి ఇంట గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.

Read More »

ఓం నమః శివాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉజ్జయినిలో  సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ.

Read More »

ఓం అరుణాచలేశ్వరాయ నమః

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరుణాచలంలో సంక్రాంతి పండుగ శనివారం స్వామివారి అలంకరణ మరియు ఊరేగింపు కార్యక్రమం.

Read More »

సంక్రాంతి శుభాకాంక్షలు… : పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ పండుగలన్నీ ప్రకృతి-పర్యావరణం ఆధారిత సంబరాలే! ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ. ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలి. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ భారతీయులందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల …

Read More »

శర్మ మృతి సంస్కృత విశ్వ విద్యాలయానికి తీరని లోటు : గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్‌ఎస్‌యు) ఉప కులపతి ఆచార్య వి.మురళీధర శర్మ గురువారం తీవ్ర గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆచార్య వి.మురళీధర శర్మ హయాంలోనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంగా ఉన్నతిని పొందిందని, ఆయన ఆకస్మిక మరణం సంస్కృత విశ్వవిద్యాలయానికి తీరని లోటని గవర్నర్ శ్రీ హరిచందన్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ …

Read More »

అందరికీ భోగి శుభాకాంక్షలు… : ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని నింపాలని ఆకాంక్షించారు. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందిoపజేయుగాక… అందరికీ మంచి ఆరోగ్యం శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

వాస‌వి అమ్మ‌వారి దేవ‌స్థానంలో క‌న్నుల పండువ‌గా శ్రీ గోదా రంగ‌నాథ క‌ళ్యాణం…

-శ్రీవారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుంద‌ర‌య్య న‌గ‌ర్ లోని మ‌ర‌క‌త వాస‌వి అమ్మ‌వారి దేవ‌స్థానంలో శ్రీ గోదా రంగ‌నాథ క‌ళ్యాణం మ‌హోత్సవం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. పుష్ప‌మాల‌ల‌తో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ …

Read More »

సంక్రాంతి పర్వదినాన రైతన్నను గౌరవించుకోవడం సంతోషదాయకం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో పూర్తి ఆత్మవిశ్వాసం నింపిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాతి పండుగ సందర్భంగా పేద రైతులు, రైతు కూలీలను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరితో కలిసి శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో పాటుగా పలు రంగాలలో సేవలందిస్తోన్న ప్రముఖులను ఘనంగా సత్కరించారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నల పండుగ …

Read More »

శోభన్ బాబు 86వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు…

-కుటుంబ చిత్ర కథానాయకుడు, వెండితెర ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నట భూషణుడు, అందాల నటుడు శోభన్‌ బాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సోగ్గాడని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. స్టేట్ వైడ్ శోభన్ సిండికేట్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కళ్లేపల్లి మధుసూదన రాజు, ధారా సత్యనారాయణ ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని శోభన్ బాబు సర్కిల్ వద్ద నిర్వహించిన శోభన్ బాబు 86 వ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. …

Read More »