Latest News

సోమవారం యధావిధిగా స్పందన కార్యక్రమం: ఆర్డీఓ కె.రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసిన కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయము మరియు డివిజన్ పరిధిలోని రెవిన్యూ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియజేశారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ప్రజా సమస్యల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు.

Read More »

సీఎం సహాయ నిధి పేదలకు ఆపద్బాంధవు : కడియాల బుచ్చిబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు కొండంత అండగా ఉంటూ పేద కుటుంబాలకు ఆపదలో ఆపద్బాంధవు గా నిలుస్తుందని వైస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు అన్నారు. ఆదివారం గుణదల వైసిపి కార్యాలయంలో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకానికి 13వ డివిజన్ కు చెందిన పతి మురహరి రావు దరఖాస్తు చేసుకోగా మంజూరైన 32వేలు చెక్కును కలసి లబ్ధిదారులకు డిప్యూటీ …

Read More »

మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని చాటి చెప్పిన మహనీయులు పూలే : కడియాల బుచ్చిబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 50 ఏళ్ల క్రితమే చదువు గొప్పదనాన్ని తెలియజేసి, మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన వైస్సార్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ , ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ . బుచ్చిబాబు మాట్లాడుతూ చదువుతోనే సమాజంలో వెలుగులు నిండుతాయని, చదువు మనిషి ఉన్నతికి …

Read More »

మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మ జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న పూలే కాంస్య విగ్రహానికి జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, నగర కమిటీ, అమ్మ వారి ధార్మిక సేవ మండలి సభ్యులు కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు మరియు యువ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాలు సామాజికంగా …

Read More »

ఎస్పీని సన్మానించిన “పెన్”…

-ప్రజాహిత కార్యక్రమాలకు మీడియా సహకారముండాలి… : కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాహిత కార్యక్రమాలకు మీడియా సహకారముండాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆకాంక్షించారు. జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) సన్మానించింది. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలసిన ” పెన్” రాష్ట్ర అధ్యక్షుడు బడే ప్రభాకర్ మాట్లాడుతూ …

Read More »

పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం… : మంత్రి కురసాల కన్నబాబు 

తాడేపల్లిగూడెం /తణుకు /అత్తిలి /పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాదరాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, స్తానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. పశ్చిమగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులకు భరోసా …

Read More »

గాలి, వెలుతురు ఇళ్లలోకి ప్రసరించేలా భవనాల నిర్మాణం జరగాలి : ఉపరాష్ట్రపతి

– పీల్చే గాలి మన ఆరోగ్య సంరక్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కరోనా మరోసారి గుర్తుచేసింది – వాయుకాలుష్యం పెరుగుతుండటం ఆందోళనకరం. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం కనుగోనాల్సిన అవసరం ఉందని సూచన – గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య వసతుల కల్పన దిశగా దృష్టిపెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – ‘ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ – బ్రాంకస్ 2021’ వార్షిక సదస్సును అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు …

Read More »

తెలుగు వారి కోసం అహర్నిశలు పని చేస్తాం : తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలో తెలుగువారి కోసం ఏర్పడి తొలి నాటి నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ TANA (Telugu Association of North America ). రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు అక్కడ వారి కోసమే కాకుండా మన దేశంలో ఉన్న తెలుగు వారందరి కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అలాంటి ఈ సంస్థకు ప్రతీ రెండు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2021లో తానా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయవం …

Read More »

రామవరప్పాడులో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ ప్రధాన కార్యాలయం ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామవరప్పాడులో నూత‌నంగా ఏర్పాటుచేసిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మంత్రి అంజద్ బాషా, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ సంయుక్తంగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ మంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ మైనార్టీల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు హ‌క్కులను ప‌రిర‌క్షించే ఉద్దేశంతో కార్యాల‌యాన్ని ఏర్పాటుచేసిన నూరుద్దీన్‌ను అభినందించారు. గ‌త ప్ర‌భుత్వాలు చేయ‌ని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమ‌మే ల‌క్ష్యం సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనేక …

Read More »

కీర్తిశేషులు సర్దార్ మరుపిళ్ళా చిట్టి  124వ జయంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పేదల పెన్నిధి, నిస్వార్థ ప్రజా నాయకుడు, కీర్తిశేషులు మరుపిళ్ళా చిట్టి  124వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, సామాన్యుల సొంత ఇంటి కల సాకారం కోసం, నిరంతరం కృషి చేసిన ప్రజా …

Read More »