-తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరికి ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవు.. -కలెక్టరు జె. నివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 18 మరియు 19 తేదీల్లో భారీ వర్షాలు మరియు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకొని వారికి కేటాయించిన ప్రదేశాల్లో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టరు జె. నివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాహశీల్థార్లు కార్యాలయాల్లో కంట్రోలు రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం …
Read More »Latest News
షుగర్ వ్యాధి పట్ల అశ్రద్ధ తగదు…
-తగు జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం దూరం -టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ -వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వాకథాన్ -మధుమేహ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : షుగర్ వ్యాధి పట్ల అశ్రద్ధ వహించడం తగదని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహవ్యాధితో తలెత్తే సమస్యలను అధిగమించవచ్చని టైమ్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ అన్నారు. ఆదివారం వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా టైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. మధుమేహ వ్యాధి …
Read More »అదుపు లేని మధుమేహం…
-ఆహారపు అలవాట్లు, వ్యాయామంతోనే నియంత్రణ సాధ్యం -మధుమేహం బారిన దేశంలో 7.7 కోట్ల మంది -ప్రభుత్వాలు మరిన్ని నియంత్రణ చర్యలు చేపట్టాలి -ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మధుమేహ వ్యాధి నియంత్రణకు అత్యవసర సౌకర్యాలను తక్షణం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడి మరణించే వారి సంఖ్య రెట్టింపవుతుందని వీజీఆర్ డయాబెటిస్ స్పషాలిటీస్ హాస్పిటల్ అధినేత, ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు డాక్టర్ …
Read More »నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : నలుగురికి విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం అని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక జిల్లా గ్రంధాలయ సంస్థ శాఖా లో ఆదివారం నిర్వహించిన 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, గ్రంధాలయాల అభివృద్ధి కి ప్రభుత్వం అందించే తోడ్పాటుతోపాటు ప్రజల సహాయ సహకారాలు ఉండాలి. విద్యా వంతులైన యువకులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేస్తే ఎలాంటి అభివృద్ధినైనా సాధించగలమన్నారు. దాతలు ఎవరైనా …
Read More »గోతం మేరీ ఝాన్సీభాయ్.. కాపవరం 9వ వార్డు మెంబెర్ గా గెలుపు
-పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు సభ్యునిగా కె.సాంబశివరావు గెలుపు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డులకు కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. కాపవరం 9వ వార్డులో 213 ఓటర్ల కి గాను 193 మంది తమ ఓటుహక్కు ను వినియోగించు కున్నారని డివిజనల్ పంచాయతీ అధికారి బిహేచ్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి తెలిపారు. కొవ్వూరు మండలం కాపవరం …
Read More »సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పుదుచ్చేరి రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ని, పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ని, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై ని, తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఐ ఏ ఎస్ ని,లక్షదీప్ అడ్మినిస్ట్ స్టేర్ ప్రఫుల్ పటేల్ ని, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె జోషి ని ఆంధ్రప్రదేశ్ …
Read More »శ్రీవారిని దర్శించుకున్న భారత హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శనివారం రాత్రి భారత హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరి వెంట పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద హోం మంత్రి, ముఖ్యమంత్రి కి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం హోం మంత్రి, ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ నుండి విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని …
Read More »మహిళల సాధికారతతో దేశాభివృద్ధి పరిపూర్ణమౌతుంది – ఉపరాష్ట్రపతి
-ఇరవై ఒకటవ శతాబ్ధపు అవసరాలకు తగిన నైపుణ్యాన్ని మహిళలు అందిపుచ్చుకోవాలి. -బ్యాంకులు సైతం మహిళలకు రుణాలు అందించేందుకు ముందుకు రావాలి -నెల్లూరు (వెంకటాచలం) స్వర్ణభారత్ ట్రస్ట్ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం – కౌసల్య సదనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశజనాభాలో సగం ఉన్న మహిళలకు సమానమైన అవకాశాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు. ఈ నేపథ్యంలో 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణమైన …
Read More »దివ్యాంగుల పట్ల దయ, సానుభూతిని చూపించటంతో పాటు వారిని ప్రోత్సహించాలి – ఉపరాష్ట్రపతి
-వారిలో ఉండే ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించగలిగితే ఏ రంగంలోనైనా వారు రాణించగలరు -దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ప్రైవేట్ రంగం ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచన -బ్యాంకులు సైతం వారికి సానుకూల దృక్పథంతో విరివిగా రుణాలు అందించాలి -నెల్లూరులోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల పట్ల సమాజం దయతో, సానుభూతితో వ్యవహరించడంతో పాటు వారిని సాధికారత దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారిలో ఉన్న ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించడం ద్వారా వారి …
Read More »మాజీ సైనికులకు న్యాయం జరగాలి… : మోటూరి శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు విమర్శించారు. తమ హక్కులు తమకు కల్పించాలంటూ ఎపీకి చెందిన మాజీ సైనికులు ‘మాజీ సైనికుల సంక్షేమ సమితి ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్‌లో శనివారం, ఆదివారాలు (నవంబర్ 13, 14లు) రెండు రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీ సైనికులకు సరిఅయిన …
Read More »