విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ క్యాలెండర్ పై లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరచడమే సచివాలయ సిబ్బంది ప్రథమ కర్తవ్యమని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 63వ డివిజన్ లోని 276, 277 సచివాలయాల సిబ్బందిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో.. శాసనసభ్యులు ఆయా సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ కార్యదర్శుల హాజరుపట్టి, రికార్డులు, ప్రజల అర్జీలను పరిశీలించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. …
Read More »Latest News
పౌరోహిత్యాన్ని కులవృత్తిగా గుర్తించాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతిపత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పురోహితుల సమస్యల పరిష్కారం కోసం సాంబమూర్తి రోడ్ ధర్నాచౌక్ నందు ఆందోళన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు పలు సమస్యలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించాలని విన్నవించారు. వీటితో పాటు పింఛన్, …
Read More »రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా సమయంలో రక్తం దొరక్క ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని హోరేబు ప్రార్థనా మందిరం నందు రాధమ్మ వెల్ నెస్ సెంటర్ లవ్ ఇన్ యాక్షన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్త్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మరణించిన పెద్దల పేరిట …
Read More »కరోనా వ్యాప్తి నియంత్రణలో ఫీవర్ సర్వే కీలక పాత్ర… : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు. సోమవారం జగ్గయ్యపేట పట్టణంలోని 14 వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని కోవిడ్ రహిత ప్రాంతంగా చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ …
Read More »లేబర్ కాలనీ వాసుల సమస్యలు పరిష్కారిస్తాం…
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలకులు నిధులు కెటాయించకుండా అభివృద్ది అంటూ ప్రచారంతో కాలక్షేపం చేశారని, జగనన్న హయంలో విజయవాడను ఐకాన్‌గా అధునిక హంగులతో భవానీపురం స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సొమవారం అధికారులతో కలిసి మంత్రి నగరంలో పలు ప్రాంతాలను పర్యటించారు. 44వ డివిజన్ లో చెరువు సెంటరు, లేబర్ కాలనీ, యద్దనపూడి వారి వీధి, మొఘల్ వారి వీధి, అప్పలస్వామి క్వారీ …
Read More »స్థాయి మరచి ముఖ్యమంత్రి ని విమర్శిస్తే గట్టి బుద్ధి చెబుతాం… : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నియోజకవర్గ పరిధిలోని 7 వ డివిజన్, మొగల్రాజపురం,బందులదొడ్డి సెంటర్ లో స్థానిక కార్పొరేటర్, వైస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించిన అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను, ప్రభుత్వ పనితీరుపై వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన డివిజన్ పర్యటన ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని,,వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ …
Read More »20న రూ. 300 టీటీడీ దర్శన కోటా టికెట్ల విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Read More »శబరిమలలో 17 నుంచి అయ్యప్ప దర్శనం…
తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Read More »భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా చర్యలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులకు మేలు జరిగేలా, ఎవరూ నష్టపోకుండా రాష్ట్ర విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత విద్యా సంవత్సరంతో పాటు గత విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా ‘ఆల్ పాస్’కు బదులు గ్రేడ్లు ప్రకటించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వల్ల గత విద్యా సంవత్సరం(2019-20)లో పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ‘ఆల్ పాస్’గా ప్రకటించిన విద్యార్థులందరికీ తాజాగా గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది.ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థులు రాసిన …
Read More »స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందన…
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : స్కోడా కుషాక్ 3000 కి పైగా బుకింగ్‌లతో అధిక స్పందనను అందుకుంది. మహావీర్ స్కోడా హైదరాబాద్ (జూబ్లీహిల్స్, సోమాజిగుడ), ఆంధ్రప్రదేశ్ (విశాకపట్నం, విజయవాడ, నెల్లూరు, భీమవరం) లలో డెలివరీలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. వినియోగదారులు మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ వద్ద వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. స్కోడా ఆటో ఇండియా మహావీర్ స్కోడా హైదరాబాద్, ఏపీ లో ఈ రోజు నుండి కొత్తగా ప్రారంభించిన కుషాక్ కస్టమర్ డెలివరీలను ప్రారంభించింది. కుషాక్ 28 జూన్ 2021 న …
Read More »