Breaking News

Monthly Archives: September 2024

నేటి నుండి మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళ వారం నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందన్నారు. దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిర్ కార్డులనుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో విధాన మన్నారు. మూడో పద్దతిలో డీడీ తీసుకుని నేరుగా రాష్టంలోని ఎక్సైజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని …

Read More »

కుటుంబం యూనిట్‌గా ఆర్థిక సాయం జ‌మ‌

– కుటుంబంలో ఒక‌రిని మాత్ర‌మే గుర్తించి, వారి ఖాతాల్లో న‌గ‌దు వేస్తున్నాం. – ఈ విష‌యాన్ని గ‌మ‌నించి, అధికార యంత్రాంగానికి స‌హ‌క‌రించాలి. – అన‌వ‌స‌రంగా కుటుంబంలో మిగిలిన వారు అర్జీలు దాఖ‌లు చేయొద్దు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వం ముంపు ప్ర‌భావిత బాధితుల‌కు కుటుంబం యూనిట్‌గా ఆర్థిక స‌హాయాన్ని అందిస్తోంద‌ని, కుటుంబంలో ఒక‌రిని గుర్తించి, వారి ఆధార్‌కు అనుసంధాన‌మైన బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా న‌గ‌దు జ‌మ‌చేయ‌డం జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. …

Read More »

అర్జీల ప‌రిష్కారంలో నాణ్య‌త‌కు ప్రాధాన్య‌మివ్వాలి

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా అందుతున్న అర్జీల‌కు అధికారులు నాణ్య‌మైన ప‌రిష్కారాన్ని చూప‌డం ప్ర‌ధాన‌మ‌ని.. విస్తృత ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన ఈ వ్య‌వ‌స్థ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా దృష్టిసారించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ సృజన.. పౌర స‌ర‌ఫ‌రాల డీఎం జి.వెంక‌టేశ్వ‌ర్లు, హౌసింగ్ పీడీ ర‌జ‌నీకుమారితో క‌లిసి …

Read More »

పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ అందించేలా సీడ్ యాప్ ద్వారా శిక్షణ

– సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన మరియు వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ కార్యాలయం …

Read More »

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతనే

-భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి -భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు -ప్రముఖ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి శత జయంతి సందర్భంగా సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ …

Read More »

సీఎం చంద్రబాబునాయుడుని కలిసిన ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటుపై అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10 వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు సోమవారం పోరంకిలోని తమ కార్యాలయంలో …

Read More »

జ‌నులంద‌రిపై ప్ర‌భువు కృప వుండాల‌ని దైవ‌జ‌నులు చేస్తున్న సేవ అభినంద‌నీయం : ఎంపి కేశినేని శివ‌నాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచంలో శాంతి, ప్రేమ, సంతోషం వుండాల‌ని కోరుకుంటూ దేవుని వ్యాక్యం ప్రచారం చేస్తున్న దైవజ‌నులంద‌రూ అభినంద‌నీయుల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం 42వ డివిజ‌న్ హెచ్.బి.కాల‌నీ లో క్రీస్తు సంఘం 23వ వార్షికోత్స‌వ ప్రార్థ‌న స‌మావేశాలకు సోమ‌వారం ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ తో క‌లిసి హాజ‌రయ్యారు. ఈ స‌మావేశాల‌కు విచ్చేసిన వారిని సంఘ‌స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌జలంద‌రిపై …

Read More »

ప్రజల మనస్సులో శాశ్వత స్దానం సంపాదించుకున్న జయప్రకాష్

-మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయిడు -ఘనంగా నివాళి అర్పించిన రాజకీయ ప్రముఖులు -వర్తమాన రాజకీయ విశ్లేషకునిగా ఘనత వహించిన జెపి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుని అడుసుమిల్లి జయప్రకాష్ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయిడు అన్నారు. సోమవారం విజయవాడ శేషసాయి కళ్యాణమండపంలో దివంగత జయప్రకాష్ సంతాప కార్యక్రమం, పెద్దకర్మ నిర్వహించగా, పలువురు ప్రమఖులు హాజరై ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయిడు మాట్లాడుతూ విజయవాడ ప్రత్యక్ష రాజకీయలలో …

Read More »

వ‌ర‌ల్డ్ స్కేట్ గేమ్స్ లో కాంస్యం సాధించిన ఆర్యాణి ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ఇట‌లీ లో జరిగిన వ‌రల్డ్ స్కేట్ గేమ్స్ ఇటలీ -2024 రోల‌ర్ డెర్బీ విభాగంలో ఇండియా త‌రుఫున ఆడి కాంస్య ప‌త‌కం సాధించిన చేబోయిన ఆర్యాణి ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అభినందించారు. ఆర్యాణి అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించట‌మే కాకుండా , స్వ‌యంగా కోచింగ్ ఇచ్చిన తండ్రి శివ‌ప‌ర‌మేశ్వ‌రరావు, త‌ల్లి నాగ‌స్వ‌ర్ణ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. విజయవాడ మధురాన‌గ‌ర్ కి చెందిన ఆర్యాణి వ‌రల్డ్ స్కేట్ గేమ్స్ ఇటలీ -2024 లో …

Read More »

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ టేనర్ పేటకు చెందిన కొత్తపల్లి జోసెఫ్ 57 ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు. కొన్నేళ్ళ క్రితమే తల్లిని కోల్పోయి ఇప్పుడు తండ్రి మరణంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. వారికి సాయం అందించాలని 47వ డివిజన్ జనసేన అధ్యక్షులు వెంపల్లి గౌరీ శంకర్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సోమవారం వారి నివాసానికి వెళ్లి స్మైలి, అక్షితలను, …

Read More »