గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారనికి విభాగాధిపతులే భాధ్యత తీసుకోవాలని, అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారాన్నిఅందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రతి సోమవారం గత వారం అందిన ఆర్జీల పరిష్కారాలపై సమీక్ష చేస్తామని, కనుక ప్రతి …
Read More »Monthly Archives: September 2024
చెరువులు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం కమిషనర్ సమ్మర్ పేట చెరువుని స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, అధికారులతో కలిసి పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చెరువు కట్టలను ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేస్తామన్నారు. సమ్మర్ పేట చెరువులో కట్ట …
Read More »సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు : మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల ప్రసాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. లడ్డూ తయారీపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం, దేవుడిని రాజకీయాల్లోకి లాగడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణించిందన్నారు. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని.. జూలైలో రిపోర్ట్ వస్తే, సెప్టెంబర్‌లో చెప్పారెందుకు..? అసలు రిజెక్ట్ చేసిన నెయ్యి.. వాడే …
Read More »దళితుల అణచివేతకు పాల్పడుతున్న కూటమి సర్కార్
-తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధర్మ పాలన సాగిస్తోందని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు. కూటమి ప్రతీకార రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధిని విస్మరించిందని ఆయన మండిపడ్డారు. అమరావతి పరిధిలో దళితుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. అసైన్డ్ భూములు దళితులకే చెందాలనే మంచి ఉద్దేశంతో తమ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ పోరాటం చేస్తుంటే, ఆయనపై అనేక రకాల కేసులు పెట్టి జైల్లో …
Read More »అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో అన్ని రాజకీయ పక్షాలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో …
Read More »పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి… : మంత్రి కొల్లు రవీంద్ర
పోతేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం మండలం చినపోతేపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి పాల్గొన్నారు. …
Read More »అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ చంద్రశేఖర రావు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 140 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి అర్జీల …
Read More »అక్టోబర్ 2, 2024 గాంధీ జయంతి సందర్భంగా కబేళా, చేపల మార్కెట్లు, మాంసపు దుకాణాలకు సెలవు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అక్టోబర్ 2, 2024 గాంధీ జయంతి సందర్భంగా సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉత్తర్వుల మేరకు 02-10-2024 తేదిన (బుధవారం) నగరంలో ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు. బుధవారం రాత్రి నుండి కబేళాలో ఎటువంటి జoతువులను వధించుటకు అనుమతి లేదు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు అన్నియు కూడా తెరుచుటకు అనుమతి లేదు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధించిన …
Read More »“ఇన్వైట్ యువర్ కమిషనర్”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఇన్వైట్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు విజయవాడ నగరపాలక సంస్థ. సోమవారం, ఈ విషయాన్ని ఒక పోస్టర్ ద్వారా సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరిచారు. ఇందులో భాగంగా ప్రజలు వారు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు అనగా ఇంటి వద్దనే ఎరువులు తయారు చేయటం (హోమ్ కంపోస్టింగ్ ), RRR, టెర్రస్ గార్డెన్, విజయవాడ స్వచ్ఛతలో పాలుపంచుకోటం వంటి అంశాల తో విజయవాడ నగరపాలక సంస్థ వారు విడుదల చేసిన పోస్టర్లో …
Read More »కాలుష్య రహిత సమాజానికై అవగాహన
-సెల్ఫీ పాయింట్స్ తో ప్రజాదరణ -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో స్వచ్ఛత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మారీస్ స్టెల్లా కాలేజ్ వద్ద షాపర్స్ స్టాప్ మాల్, గురునానక్ కాలనీ లోని ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద, పంట కాలవ రోడ్డు దగ్గర నారాయణ …
Read More »
Prajavartha Online Telugu News