Breaking News

Monthly Archives: September 2024

ఈవీఎం గోడౌన్‌ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును శనివారం జిల్లా కలెక్టర్‌ డా. జి.సృజన సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీయంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్‌ గోడౌన్‌ కు వేసిన సీల్డ్‌ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్‌ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను …

Read More »

స్వర్ణాంధ్ర@ 2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలి….

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తుల విలువ 15% పెరిగే విధంగా స్వర్ణాంధ్ర@ 2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర @2047 విజన్ పత్రం తయారీపై వివిధ వర్గాల వాటాదారులతో కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 2047 సంవత్సరం …

Read More »

ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం ఉదయం సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారిగా పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పాల్గొని ఫ్రీ హోల్డ్ …

Read More »

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి శనివారం స్థానిక 12వ డివిజన్ రైలు పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమం చివరి రోజు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

దసరా ఉత్సవాలకు వచ్చే అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాటల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా దసరా ఉత్సవాలకు జరిగే ఏర్పాట్లను వన్ టౌన్ వినాయకుని గుడి నుండి మొదలుపెట్టి, రథం సెంటర్, కెనాల్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ …

Read More »

వాల్ పెయింటింగ్స్ ద్వారా స్వచ్ఛత హి సేవ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత హి సేవలో భాగంగా శనివారం ఉదయం స్లం ట్రాన్స్ఫర్మేషన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 11వ డివిజన్ పటమట రిలీస్ కాలనీ నందు గోడల పైన వాల్ పెయింటింగ్స్ వేస్తూ ఆ గోడను ప్రజల భాగ్యస్వామ్యంతో అందంగా మార్చారు విజయవాడ నగరపాలక సంస్థ. స్లం ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా విజయవాడలో ఉన్న మురికివాడలలో గోడల పైన అందమైన పెయింటింగ్ వేస్తూ అక్కడ ఉన్న ప్రజలకు స్వచ్ఛత హి …

Read More »

ఔట్ ఫాల్ డ్రైన్ లలో నీరు ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం 46వ డివిజన్లో గల మిల్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైవ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అందుకు నిరంతరం తగు చర్యలు తీసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న అన్ని అవుట్ఫాల్ డ్రైనలలో నీటి ప్రవాహంలో ఎక్కడ ఆటంకం లేకుండా చూసుకోవాలని ప్రతి …

Read More »

చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షో రూమ్ ని హీరోయిన్ శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూమ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..విజయవాడలో చాలా షో రూమ్ లు ప్రారంభించాననీ చెప్పారు.కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరనీ,వీరి వద్ద సారీస్ కలెక్షన్ చాలా …

Read More »

స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై అందరూ కృషి చెయ్యాలి

-జిల్లా క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ -పారిశుధ్య కార్మికులకు ఆప్రాన్లు పంపిణీ -స్వచ్ఛభారత్ పై నిర్వహించిన వివిధ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత -“అమ్మ పేరిట ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు -అలరించిన సాంగ్ అండ్ డ్రామా కళాకారుల మ్యాజిక్ షో కాకినాడ, సెప్టెంబర్ 28: స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారతదేశానికై కృషి చెయ్యాలని కేంద్ర ప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి శ్రీరామ మూర్తి కందాళ ఐ.ఐ.ఎస్ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు …

Read More »

విద్యార్థులు చదువుతో పాటు కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో రాణించాలి

-ఘనంగా నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు -ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నలంద డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థులు, ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేలా కళాశాల సీనియర్ విద్యార్థులు ఆట పాటలతో సందడి చేసారు. తెలుగు, హిందీ, మలయాళం సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూతలూగించారు. వేదిక పై ఉన్న విద్యార్థులే కాకూండా, వేదిక ముందు కూర్చొని …

Read More »