విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత హి సేవలో భాగంగా శనివారం ఉదయం స్లం ట్రాన్స్ఫర్మేషన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 11వ డివిజన్ పటమట రిలీస్ కాలనీ నందు గోడల పైన వాల్ పెయింటింగ్స్ వేస్తూ ఆ గోడను ప్రజల భాగ్యస్వామ్యంతో అందంగా మార్చారు విజయవాడ నగరపాలక సంస్థ. స్లం ట్రాన్స్ఫర్మేషన్ లో భాగంగా విజయవాడలో ఉన్న మురికివాడలలో గోడల పైన అందమైన పెయింటింగ్ వేస్తూ అక్కడ ఉన్న ప్రజలకు స్వచ్ఛత హి సేవ పై అవగాహన కల్పిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛత పై విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుంది.
Prajavartha Online Telugu News