Breaking News

ఔట్ ఫాల్ డ్రైన్ లలో నీరు ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం 46వ డివిజన్లో గల మిల్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైవ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోవాలని అందుకు నిరంతరం తగు చర్యలు తీసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న అన్ని అవుట్ఫాల్ డ్రైనలలో నీటి ప్రవాహంలో ఎక్కడ ఆటంకం లేకుండా చూసుకోవాలని ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు.

ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ విభాగం ఇద్దరి సమన్వయంతో నిత్యం మేజర్, మైనర్, మీడియం, డ్రైన్లలను పరిశుభ్రపరుస్తుండాలని, మ్యాప్ ల సహాయంతో మైనర్ డ్రైన్ ల క్లీనింగ్ పర్యవేక్షిస్తుండాలని, దానికనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, సూపరిండెంట్ ఇంజనీర్ రామ్మోహన్, జోనల్ కమిషనర్ వన్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *