విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షో రూమ్ ని హీరోయిన్ శ్రీలీల లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూమ్ ను సందర్శించారు. ఈ సందర్బంగా హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ.చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..విజయవాడలో చాలా షో రూమ్ లు ప్రారంభించాననీ చెప్పారు.కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరనీ,వీరి వద్ద సారీస్ కలెక్షన్ చాలా బాగుందన్నారు.మా అమ్మకి పట్టుచీరలు అంటే చాలా ఇష్టమని…అందుకే తాను కూడా పట్టుచీరలు కట్టుకుంటానని చెప్పారు. లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. రవితేజ తో తన కొత్త సినిమా ప్రారంభం కానుందనీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా నటించనున్నాను అన్నారు.
తదనంతరం మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ…విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందనీ,.జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారనీ గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా కూడా రెండుసార్లు గెలిచారనీ చెప్పారు. జనార్దన్ రెడ్డి ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ నూతన షో రూమ్ విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక అన్ని శుభ పరిణామాలే అన్నారు..ఇలాంటి షో రూములు పెట్టడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. సుమారుగా చెన్నై షాపింగ్ మాలలో 500 పైగా వర్కర్లు పనిచేస్తున్నారనీ,ఇలాంటి షో రూములు ఉంటే యువతకు ఉద్యోగాలకి కొరత ఉండదన్నారు.
అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 19 షాపింగ్ మాల్ ప్రారంభించామనీ,కస్టమర్ టెస్ట్ కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తున్నామన్నారు.99 రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్ లో ప్రతి ఒక్కరు షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయన్నారు.చేనేత కార్మికులకు మా ద్వారా పని కూడా కల్పిస్తున్నామనీ,కంచి ,ధర్మవరం ,బెనారస్, ఉప్పాడ ,వివిధ రకాలైన పట్టు వస్త్రాలు అన్ని సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు.ప్రతి ఒక్కరు చెన్నై షాపింగ్ మాల్ ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News