-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలకు విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాటల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా దసరా ఉత్సవాలకు జరిగే ఏర్పాట్లను వన్ టౌన్ వినాయకుని గుడి నుండి మొదలుపెట్టి, రథం సెంటర్, కెనాల్ రోడ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఉత్సవాలకు మొత్తం 26 ప్రదేశాలలో 32 లక్షల ప్యాకెట్ల త్రాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఎనిమిది ప్రాంతాలలో 150 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, ఆరు ప్రాంతాలలో 6 క్లాక్ రూమ్స్ ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏ ఏ ప్రదేశాలలో ప్రజలకు సౌకర్యాలు అవసరం ఉంటుందో, ఆ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు తయారు చేసిన ప్రణాళికలో ఉన్న ప్రదేశాలను పరిశీలిస్తూ ప్రజలకు అవసరమయ్యే ప్రదేశాలలో వసతులు ఏర్పాటు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతోపాటు చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి. రత్నావళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ రామ్మోహన్, జోనల్ కమిషనర్ వన్ రమ్య కీర్తన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News