Breaking News

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు. మంత్రి శనివారం స్థానిక 12వ డివిజన్ రైలు పేటలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమం చివరి రోజు సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చిన విషయం మంత్రి గుర్తు చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. తమ ప్రభుత్వం ఒకటో తేదీనే వృద్ధులకు, వికలాంగులకు సామాజిక పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు అందిస్తోందన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పనుల కల్పనతో పాటు మున్సిపాలిటీలలో 15 ఆర్థిక సంఘం నిధులతో ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు జత చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

తొలుత మంత్రి తమ గృహం వద్ద ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం సేకరించిన సరుకుల వాహనానికి మంత్రి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ లో వరదల కారణంగా ముంపు ప్రాంతాల వరద బాధితులను ఆదుకునేందుకు గతంలో ఎన్నడు లేని విధంగా స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చారని అన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి వరద సహాయక కార్యక్రమాలు చేపట్టిన తీరు ప్రశంసనీయం, వారికి బాసటగా నిలవడం అమోఘం అన్నారు. ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి వేము కోటేశ్వరరావు వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్సురెన్స్ ఉద్యోగులు ముందుకు వచ్చారని, వంట పాత్రలు, దుస్తులు నిత్యవసర సరుకులు ఒక్కొక్కటి 3 వేల విలువైన కిట్ లు 300 మంది వరద బాధితులకు అందించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాలలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, ఇలియాస్ పాష , వెంకన్న, శ్రీరాములు, స్థానిక నాయకులు, ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *