Breaking News

ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెలాఖరిలోగా ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం ఉదయం సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారిగా పురోగతిని సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని వారి చాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పాల్గొని ఫ్రీ హోల్డ్ భూములపై జిల్లా పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ల స్థాయిలో ఉన్న 682 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన పూర్తయిందని, కొన్ని సమస్యల వల్ల ఆర్డీవోల స్థాయిలో ఉన్న 310 ఎకరాలు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ భూ విభాగం పర్యవేక్షకులు నెల్సన్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *