Breaking News

వాగులు, వంకల వద్ద నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

– వర్షాల వేళ ప్రజల భద్రత‌కు ప్రాధాన్య‌మిస్తూ చ‌ర్య‌లు
– అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాలు
– భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించిన క‌లెక్ట‌ర్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, వంతెనలు, చెరువులు, ఇతర జలవనరుల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హెచ్‌. ముత్యాలంపాడు వంతెన, వెలగలేరు తదితర ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. వర్షాల పరిస్థితి, వాగులు–వంకల్లో నీటి ప్రవాహం, వంతెనల స్థితిగతులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరిగిన సందర్భాల్లో ప్రజలు వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వంతెనలు, కల్వర్టులు, రహదారుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనించాలని, ఎక్కడైనా రాకపోకలకు ఇబ్బంది లేదా ప్రమాదకర పరిస్థితి ఏర్పడే అవకాశ‌ముంటే వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, వాగులు, వంకల పరిస్థితిని స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, వర్షాల పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు చేపట్టాలని క‌లెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *