Breaking News

శాసనాలను మార్చగలిగిన శక్తి ఒక్క దేవునికే ఉంది: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

-అజిత్‌సింగ్‌నగర్ ఆర్సీఎం చర్చీ నూతన దేవాలయ నిర్మాణానికి వైభవోపేతంగా శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బైబిల్‌లో చెప్పిన విధంగా శాసనాలను మార్చగలిగిన శక్తి ఆ దివ్య దేవునికి మాత్రమే ఉందని, అజిత్‌సింగ్‌నగర్ ఆర్సీఎం చర్చీ నూతన నిర్మాణం విషయంలో ఇది మరోసారి రుజువైందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

గురువారం అజిత్‌సింగ్‌నగర్‌లోని ఆర్సీఎం చర్చీ (పరిశుద్ధ సిలువ దేవాలయం) నూతన నిర్మాణానికి గురువారం వైభవోపేతంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ… దేవునికి అసాధ్యమైనదేది లేదని, ఆయన తలచుకుంటే శాసనాలను సైతం మార్చగలరని అన్నారు. గతంలో చర్చీలు, మసీదులు, దేవాలయాల నిర్మాణాలకు భవన అనుమతులు, ఇతర ఛార్జీల రూపంలో అధిక మొత్తంలో ఖర్చు అయ్యేదని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఏపీ బిల్డింగ్ రూల్స్–2017లో చేసిన సవరణల ద్వారా మతపరమైన ప్రార్థనా మందిరాల నిర్మాణానికి అనుమతి ఫీజులు, ఇతర ఛార్జీల విషయంలో మినహాయింపులు కల్పించడం జరిగిందన్నారు.

దీంతో అజిత్‌సింగ్‌నగర్ ఆర్సీఎం చర్చీ నూతన నిర్మాణానికి అనుమతులు సులభతరమయ్యాయని, ఇది యేసుప్రభువు చేసిన గొప్ప కార్యంగా తాను భావిస్తున్నానని బొండా ఉమా గారు పేర్కొన్నారు. ఈ పవిత్ర దేవాలయ నిర్మాణంలో యేసయ్యే ముందుండి అన్ని కార్యాలను నడిపిస్తున్నారని, చర్చీ నిర్మాణానికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ మేత్రాణులు మోస్ట్ రెవ. డాక్టర్ జోసెఫ్ రాజారావు తెలగతోటి మాట్లాడుతూ… అజిత్‌సింగ్‌నగర్‌లో ఆర్సీఎం చర్చీ నూతన దేవాలయ నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అని అన్నారు. సంఘస్తులంతా ఒకే కుటుంబంలా ఐకమత్యంతో ఉంటూ దేవుని ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించి, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు, అజిత్‌సింగ్‌నగర్ విచారణ గురువులు ఫాదర్ గడ్డం జోజి, ఇతర ఫాదర్లు, సిస్టర్లు, సంఘ పెద్దలు, సంఘస్తులతో కలిసి నూతన దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్లు ఎం. గాబ్రియేల్, ఎం. చిన్నప్ప, కిషోర్, అనిల్ ఫ్రాన్సిస్, మరియదాస్, ఫ్రాన్సిస్, స్లీవరాజు, విజయ్, కిరణ్, వినోద్, పరిశుద్ధ సిలువ దేవాలయం సంఘ పెద్దలు బూరె రాజేష్, పాగోలు రాము, వై. జాన్ పీటర్, ఆర్. ఆంటోని, బాలరాజు, జోజియప్ప, చిన్నప్ప, రవికుమార్, ప్రదీప్‌కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *